News


వాట్సాప్‌ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక

Wednesday 19th June 2019
news_main1560927127.png-26411

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని క్లిష్టమైన సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ఉద్దేశించిన వాట్సాప్‌ ఇండియా చాలెంజ్‌లో ఐదు స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఒక్కో స్టార్టప్‌కు రూ.35 లక్షలు (50 వేల డాలర్లు) ఫండింగ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎంపికైన స్టార్టప్స్‌.. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ మెడ్‌కార్డ్స్, వర్చువల్‌ రియాలిటీ కంటెంట్‌ మెల్జో, వాట్స్‌అప్‌ ఆధారిత ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ జావీస్, అగ్రిటెక్‌ గ్రామోఫోన్, రియల్‌ టైమ్‌ ఎలక్రిసిటీ లెవల్‌ మినీ ఆన్‌ ల్యాబ్స్‌. ఆయా స్టార్టప్స్‌లో పెట్టుబడులతో పాటూ భాగస్వాములమవుతామని వాట్స్‌అప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో విదేశాల నుంచి టెక్నాలజీ కంటెంట్‌ను తీసుకొచ్చి.. మన దేశం, స్థానిక అవసరాలకు అనుగుణంగా సాంకేతికతలో మార్పులు చేసేవాళ్లమని, కానీ, ఇప్పుడు ఇన్‌హౌజ్‌ టెక్నాలజీ డెవలప్‌ చేసే స్థాయికి స్టార్టప్స్, టెక్‌ కంపెనీలు ఎదిగాయని తెలిపారు. 



You may be interested

పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ

Wednesday 19th June 2019

మేలో 2.96 శాతం వృద్ధి ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన మే నెలలో 2.96 శాతం పెరిగింది. విమానయాన సంస్థలు సంయుక్తంగా 1.22 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సం‍ఖ్య 1.85 కోట్లుగా ఉంది. డీజీసీఏ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 49 శాతం మార్కెట్‌ వాటాతో ఇండిగో ప్రథమ స్థానంలో ఉండగా.. స్పైస్‌జెట్‌ వాటా 13.1

సిటీ బ్యాంకుతో బజాజ్‌ అలయంజ్‌ భాగస్వామ్యం

Wednesday 19th June 2019

పుణె: బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, సిటీ బ్యాంకు మధ్య కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదిరింది. బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన బీమా ఉత్పత్తులను సిటీ బ్యాంకు తన శాఖల ద్వారా పంపిణీ చేయనుంది. వైద్య, వ్యక్తిగత ప్రమాద, వాహన, గృహ, పర్యాటక బీమా పాలసీలను సిటీ బ్యాంకు కస్టమర్లకు బజాజ్‌ అలయంజ్‌ ఆఫర్‌ చేయనుంది. దేశంలో ప్రతీ పౌరుడికీ చేరటంతో పాటు వారికి అనువైన బీమా ఉత్పత్తులను

Most from this category