News


గోప్యతకు వాట్సాప్‌లో మరో ఫీచర్‌

Thursday 7th November 2019
news_main1573097034.png-29404

న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్‌.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న 'నోబడీ' ఆప్షన్‌ స్థానంలో 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌' అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. యూజరును నేరుగా గ్రూప్‌లో చేర్చేందుకు తమకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు .. వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు. పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా నిఘా పెట్టేందుకు దరిమిలా.. యూజర్ల వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

టాటా స్టీల్‌ లాభం రూ.3,302 కోట్లు

Thursday 7th November 2019

క్యూ2లో 6 శాతం వృద్ధి  రూ.34,763 కోట్లకు తగ్గిన ఆదాయం  57 శాతం తగ్గిన దేశీ నిర్వహణ లాభం న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లుతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763

నెలకు రూ.64,167 కోట్ల లావాదేవీలు

Thursday 7th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ‘గూగుల్‌ పే’ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో 6.7 కోట్లకు చేరుకుంది. 2018 సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరు నాటికి యాక్టివ్‌ యూజర్లు మూడు రెట్లు పెరిగారని గూగుల్‌ పే ఎండీ సజిత్‌ శివానందన్‌ బుధవారం తెలిపారు. వ్యాపారస్తుల కోసం గూగుల్‌ పే యాప్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2017 సెప్టెంబరులో గూగుల్‌ పే యాప్‌ను భారత్‌లో

Most from this category