News


మందగమనంలోనూ జోరు మీదున్న వైట్‌గూడ్స్‌

Monday 12th August 2019
news_main1565548238.png-27695

మందగమనం... నేడు కార్పొరేట్‌ సమూహంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనూ వైట్‌ గూడ్స్‌ (కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌) పరిశ్రమ జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 30 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఆటోమొబైల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు వృద్ధి మందగమనం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కానీ, అటువంటి పరిస్థితులేమీ వైట్‌ గూడ్స్‌ పరిశ్రమలో కనిపించకపోవడం సానుకూలం. 

 

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ను పరిశీలిస్తే... కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ విభాగం వార్షికంగా అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 31.7 శాతం పెరిగి రూ.786 కోట్లుగా నమోదైంది. ఈ కంపెనీ ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారం మాత్రం 5.3 శాతం తగ్గి రూ.514 కోట్లుగా నమోదైంది. ఇతర విభాగాలతో పోలిస్తే కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ వ్యాపారం మంచి పనితీరు చూపించినట్టు బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ సీఈవో అనంత్‌ పురంధరే తెలిపారు. ‘‘ఫ్యాన్లు, కూలర్లు క్యూ1, క్యూ2లో పండుగల కారణంగా అధిక విక్రయాలు జరుగుతాయి. క్యూ3లో శీతాకాలం కావడంతో రూమ్‌, వాటర్‌ హీటర్ల అమ్మకాలు పెరుగుతాయి. పంపిణీ నెట్‌వర్క్‌ విస్తృతి దృష్ట్యా బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ ప్రస్తుత వృద్ధి అవకాశాలను కొనసాగించగలదు’’అని అనంత్‌ వెల్లడించారు. ఇక వోల్టాస్‌ క్యూ1లో అమ్మకాల ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,647 కోట్లుగా నమోదైంది. ఎయిర్‌ కండీషనర్‌ విక్రయాల్లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. రూమ్‌ ఏసీల అమ్మకాలు 47 శాతం పెరిగి రూ.1,749 కోట్లుగా ఉన్నాయి. ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌ సంస్థలు కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌లో 31.7 శాతం, 16 శాతం చొప్పున వృద్ధిని జూన్‌ త్రైమాసికంలో సాధించాయి. లైటింగ్‌, టెలివిజన్‌ ఉత్పత్తుల అమ్మకాలు మాత్రమే తగ్గడం గమనార్హం. 

 

వాతావరణం కూడా కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ ఉత్పత్తుల అమ్మకాల విక్రయాలకు అనుకూలంగా ఉండడం గమనించాల్సిన విషయం. వర్షాలు ఆలస్యం కావడం, జూన్‌ నెలలో దాదాపు వర్షాలే లేవు. దీనివల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు అధికంగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి వాతావరణం ఎక్కువ కాలం కొనసాగడం అమ్మకాలు జోరుగా సాగేందుకు తోడ్పడింది. అప్లయనెన్స్‌ విభాగం పరంగా పరిశ్రమలో ఎటువంటి మందగమనం లేదని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే వేసవి అధిక వేడితో ఉండడమే కారణమని తెలిపారు. ఓనమ్‌కు అమ్మకాలు ఉపందుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గతేడాది కేరళకు వరదల వల్ల డిమాండ్‌పై ప్రభావం పడిందని, దాంతో ఈ ఏడాది వినియోగం అధికంగా ఉంటుందని అంచనా వేశారు.



You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Monday 12th August 2019

బక్రీద్‌ సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు.  అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్సే​ంజ్‌లు మాత్రం మధ్యాహ్నం పనిచేయవు. సాయంత్ర సమయంలో యధావిధిగా పనిచేస్తాయి. ఇక స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (13న) ప్రారంభమవుతుంది. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం మార్కెట్‌ వరుసగా రెండోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.70

దీన్ని బోటమ్‌ అని చెప్పడం కష్టం: క్యాపిటల్‌ ఎయిమ్‌

Sunday 11th August 2019

మార్కెట్‌లో ఇది కనిష్టం, ఇది గరిష్టం అని చెప్పడం కష్టమని, ఇన్వెస్టర్లు ఈ దశలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ విభాగంలో పెట్టుబడుల పరంగా దూకుడుగా వ్యవహరించకుండా ఉండాలని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారి సూచించారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను దీర్ఘకాలానికి ఎంచుకోవాలని సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.    ‘‘ఇటీవలి 11,000లోపు కనిష్టాల నుంచి నిఫ్టీ-50 తిరిగి వెనక్కి పుంజుకోవడం

Most from this category