News


హెచ్‌యూఎల్‌ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 18th January 2019
news_main1547791689.png-23664

క్యు3లో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌పై ఎక్కువశాతం బ్రోకరేజ్‌లు పాజటివ్‌గా ఉన్నాయి. కొన్ని సంస్థలు మాత్రం న్యూట్రల్‌ ధృక్పధం వ్యక్తం చేశాయి.
1. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2010. కంపెనీ సైజుతో పోలిస్తే వాల్యూంల్లో 10 శాతం వృద్ధి సబబుగానే ఉంది. కంపెనీ రూరల్‌ డిమాండ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేసింది. అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలుచేయడం(ఎగ్జిక్యూషన్‌) కంపెనీకి కీలక పాజిటివ్‌ అంశం. రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్‌లో 15 శాతానికి పైగా వృద్ధి కొనసాగవచ్చు.
2. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2059. కొత్త ఏరియాల్లోకి చొచ్చుకుపోతుండడంతో వాల్యూంల్లో వృద్ధి నమోదవుతోంది. ఫలితాలు అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. 
3. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1900. స్థిరమైన ఫలితాలనిచ్చింది. కానీ రాబోయే రోజుల్లో మందగమనం ఉండొచ్చు. వాల్యూంలు, రెవెన్యూల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదయింది. జీఎస్‌టీ తలనొప్పులు తగ్గినట్లే కనిపిస్తోంది. వాల్యూషన్లు భారీగా ఉన్నందున మరింత పెరుగుదలకు ఆస్కారం తక్కువ.
4. జెఫర్రీస్‌: హోల్డ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1770. ఫలితాలు ముఖ్యంగా నికర విక్రయాలు బాగున్నాయి. అయితే మార్జిన్‌ అంచనాల కారణంగా అప్‌గ్రేడ్‌కు అవకాశం తక్కువ. వాల్యూషన్లు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవు. 



You may be interested

లాంగ్‌టర్మ్‌ కోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Friday 18th January 2019

దీర్ఘకాల పెట్టుబడితో దాదాపు 50 శాతం వరకు రాబడినందించే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. యాంబిట్‌ క్యాపిటల్‌ రికమండేషన్‌- వీఐపీ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 653. దేశంలో లీడింగ్‌ లగేజ్‌ బ్రాండ్‌. డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌, ఉత్పత్తుల నాణ్యత కంపెనీని బలంగా నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎబిటాలో 25 శాతం వార్షిక వృద్ధి ఉండొచ్చు. రెవెన్యూలో 24 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. కరెన్సీ ఒడిదుడుకులు, ముడిపదార్ధాల వ్యయం

రూ.700 కోట్లు ఇస్తా.. షరతులు వర్తిస్తాయ్‌ !

Friday 18th January 2019

ఎస్‌బీఐకు జెట్‌ ఎయిర్‌వేస్ చీఫ్ నరేష్ గోయల్ లేఖ న్యూఢిల్లీ: నిధుల కటకటతో ఇబ్బందులు పడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ ముందుకు వచ్చారు. కానీ కొన్ని షరతులకు అంగీకరిస్తేనే ఈ పెట్టుబడులు పెడతానని వెల్లడించారు.  జెట్‌ ఎయిర్‌వేస్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడంతో పాటు తన షేర్లను మొత్తాన్ని తనఖా పెట్టేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. అయితే తన వాటా 25

Most from this category