News


టెక్‌ మహీంద్రా షేరును ఏం చేద్దాం?

Wednesday 22nd May 2019
news_main1558512624.png-25886

మార్చి త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా నికర లాభం దాదాపు 9 శాతం క్షీణించింది. కానీ ప్రముఖ బ్రోకరేజ్‌లు కంపెనీ షేరుపై పాజిటివ్‌గానే ఉన్నాయి. 
1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 950 నుంచి రూ. 910కి తగ్గించింది. క్యు4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. టెలికం వ్యాపారం బాగుంది. హువావేపై నిషేధం కంపెనీపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. ఈపీఎస్‌ అంచనాలు 3 శాతం మేర తగ్గింపు. 
2. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 810. టెలికం విభాగం వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వృద్ధి నమోదు చేసింది. కానీ ఫారెక్స్‌ తలనొప్పుల కారణంగా మార్జిన్లు తగ్గాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా టెలికం విభాగమే కంపెనీకి కీలకం కానుంది. కంపెనీ రెవెన్యూ అంచనాలు అరశాతం, ఈపీఎస్‌ అంచనాలు ఒక్క శాతం మేర తగ్గింపు.
3. జెఫర్రీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 880. తాజా ఫలితాల్లో గ్రోత్‌ నిరాశ పరిచింది. కానీ కొత్త ఏడాది గైడెన్స్‌ బాగుంది. రిస్క్‌రివార్డు అనుకూలంగా ఉండొచ్చు. ప్రస్తుతం స్టాకు సరసమైన పీఈ వద్దే ఉంది. ప్రస్తుత స్థాయిల వద్ద కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉంది. 



You may be interested

ఇండస్‌ఇండ్‌ లాభంలో 62 శాతం క్షీణత

Wednesday 22nd May 2019

మార్చి త్రైమాసికానికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నికరలాభం భారీగా పతనమైంది. క్యు4లో బ్యాంకు లాభం 62.21 శాతం క్షీణించి రూ. 360.10 కోట్లకు చేరింది. ప్రొవిజన్స్‌ ఐదు రెట్లు పెరగడం నికరలాభంపై తీవ్ర ‍ప్రభావం చూపింది. గత క్యు4లో బ్యాంకు రూ. 953.09 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ. 1561 కోట్లను చేరాయి. గత క్యు4లో ఈ కేటాయింపులు రూ. 335 కోట్లు

జీఎస్‌పీఎల్‌ షేర్లకు ఫలితాల షాక్‌

Wednesday 22nd May 2019

గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు నిరుత్సాహపరచడంతో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్లో  9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌లో కంపెనీ షేర్లు రూ.154.9ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీలు ఫలితాలను విడుదల చేసింది. క్యూ4 రూ. 2146 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 308 కోట్ల నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం

Most from this category