News


ఇండస్‌ఇండ్‌ షేరు టార్గెట్‌ తగ్గింపు!

Friday 11th October 2019
news_main1570773862.png-28823

క్యు2లో ప్రొవిజన్లు పెరిగినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో బ్యాంకు షేరు టార్గెట్‌ధరను బ్రోకింగ్‌ సంస్థలు తగ్గించాయి. షేరుపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలాఉన్నాయి...
1. ఎడెల్‌వీజ్‌: టార్గెట్‌ ధరను రూ. 2060 నుంచి 1793కు తగ్గించింది. చారిత్రక ట్రెండ్‌ కన్నా వృద్ధి బాగా క్షీణించింది. ఆస్తుల నాణ్యత ప్రస్తుతానికి బాగానే ఉన్నా, కొన్ని అకౌంట్లు సవాళ్లుగా మారాయి. పీఈ మల్టిపుల్స్‌ దిగివచ్చినందున టార్గెట్‌ను తగ్గించడం జరిగింది.
2. గోల్డ్‌మన్‌ సాక్స్‌: న్యూట్రల్‌ రేటింగ్‌తో టార్గెట్‌ను రూ. 1474కు తగ్గించింది. పీసీఆర్‌ బలహీనంగా ఉండడం, మందగమనం, మేనేజ్‌మెంట్‌ మార్పుపై అస్పష్టత బ్యాంకు ముందున్న సవాళ్లని తెలిపింది.
3. మోర్గాన్‌స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌తో రూ.2000 టార్గెట్‌గా నిర్ణయించింది. లోన్‌గ్రోత్‌ మందగించడం, నిర్వహణా వ్యయాలు పెరగడం, కేటాయింపులు పెరగడంతో ఎర్నింగ్స్‌ అంచనాలు తప్పాయని తెలిపింది.
4. ఫిలిప్‌ క్యాపిటల్‌: కొనొచ్చ రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 1800 నుంచి రూ. 1500కు తగ్గించింది. మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం కారణంగా కన్జూమర్‌ బుక్‌లో స్లిపేజ్‌లు ఎక్కువయ్యాయని తెలిపింది. 
5. బెర్నిస్టైన్‌: మేనేజ్‌మెంట్‌ మార్పులపై అస్పష్టతలే మార్కెట్లో షేరు ధరను ప్రభావితం చేస్తున్నాయి. బ్యాంకు నాణ్యత కన్నా మేనేజ్‌మెంట్‌లో మార్పులనే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.



You may be interested

60 డాలర్ల పైకి క్రూడ్‌ ఆయిల్‌

Friday 11th October 2019

ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) దేశాలు చమురు సరఫరాను మరింత తగ్గించనున్నారనే సంకేతాలు వెలువడడంతో పాటు, యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో శుక్రవారం చమురు ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.03 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.86 శాతం లాభపడి బారెల్‌ 60.20 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.68 శాతం లాభపడి బారెల్‌ 54.45 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత సెషన్‌లో

టీసీఎస్‌ 2% డౌన్‌, మిశ్రమంగా ఐటీ షేర్లు!

Friday 11th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నప్పటికి, టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడం, రూపీ డాలర్‌ మారకంలో బలపడడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు మిశ్రమంగా ట్రేడవతున్నాయి. ఉదయం 11.10 సమయానికి నిప్టీ ఐటీ ఇండెక్స్‌​0.12 శాతం లాభపడి 15,112.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఇన్ఫోసిస్‌ 2.20 శాతం లాభపడి రూ. 800.25 వద్ద ట్రేడవుతుండగా, ఫలితాల ప్రభావంతో టీసీఎస్‌ 2.66

Most from this category