News


మైండ్‌ట్రీ డీల్‌ తర్వాత ఏమైంది..?

Wednesday 31st July 2019
news_main1564544798.png-27423

సోమవారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర గాలింపు చర్చల తరువాత ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. ఆయన మృతిపై పలు సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో సిద్ధార్థ వ్యాపార లావాదేవీల వివరాలు.....

కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్ అని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్ సెక్యూరిటీస్‌ కింద చేతన్ ఉడ్‌ ప్రాసెసింగ్‌, బేర్‌ఫుట్ రిసార్ట్స్‌ (ఆతిథ్య రంగం) డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్‌ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్‌, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్ అయిన అశోక్ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్‌ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్‌ ద్వారా రూ. 2,858 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. 

అప్పుల కుప్పగా కాఫీ డే...
కాఫీ డే చెయిన్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది.  అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 31st July 2019

క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై భారీగా క్షీణించిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 139 పాయింట్ల క్షీణతతో 37,259 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 11,034 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నులతో కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల తాకిడిని చవిచూస్తున్న సూచీలకు తాజాగా అంతరర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల

కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం

Wednesday 31st July 2019

ప్రముఖ కాపీ అవుట్‌లెట్స్‌ ఛైన్‌ వ్యవస్థాపకుడు కేజీ సిద్ధార్థ మృతదేహం బుధవారం తెల్లవారుజామున నేతాృవళి నదిలో లభ్యమయ్యింది. సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ ఏమయ్యారోనన్న అనుమానాలకు దీంతో తెరపడింది. వి జి సిద్ధార్థ మృతదేహాన్ని హోయిజ్ బజార్‌ సముద్ర తీరంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి మత్స్యకారులు గుర్తించారు. చివరిసారిగా సిద్ధార్థను చూసిన ప్రాంతం నుంచి ఈ తీరం ఒక కిలో మీటర్‌ దూరంలోనే ఉండడం గమనర్హం. పోస్ట్‌మార్టం నిర్వహించడానికి

Most from this category