News


ఎన్‌బీఎఫ్‌సీలపై దివాలా చర్యలకు శ్రీకారం!

Tuesday 19th November 2019
news_main1574134642.png-29689

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలుసహా నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘తాజా ఆడిటెడ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం రూ.500 కోట్లు ఆపైన ఆస్తులు కలిగిఉన్న ఎన్‌బీఎఫ్‌సీ (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలుసహా)లపై దివాలా ప్రక్రియను చేపట్టవచ్చు’’ అని పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో చర్చల అనంతరం ఈ నోటిఫికేషన్‌ జారీ అయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక సమస్యల పరిష్కారం దిశలో ఇది కీలక అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు. దివాలా కోడ్‌ కింద బ్యాంకులు మినహా కీలక ఎఫ్‌ఎస్‌పీ (ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు)లతో ఎలా వ్యవహరించాలన్న అంశంపై శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను కార్పొరేట్‌ మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. దివాలా ప్రక్రియ చేపట్టాల్సిన ఎఫ్‌ఎస్‌పీ కేటగిరీలను ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 



You may be interested

11,900పైన నిఫ్టీ

Tuesday 19th November 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్లుగా స్వల్ప నష్టాల్ని చవిచూసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 35 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,900 పాయింట్లపైన 11,919 పాయింట్ల వద్ద మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 170 పాయింట్ల లాభంతో 40,455 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత

Tuesday 19th November 2019

2015లో లైసెన్స్‌ 2018లో కార్యకలాపాలు మొదలు ఈ ఏడాది జూలైలో స్వచ్ఛందంగా మూసివేత  ముంబై: మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా  ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా

Most from this category