News


వారంతం బిజినెస్‌ బిట్స్‌

Saturday 18th May 2019
news_main1558185957.png-25825

ఎయిర్‌టెల్‌ రైట్‌ ఇష్యూకి మంచి స్పందన
 రూ. 24,939 కోట్ల మూలధన సమీకరణలో భాగంగా  రైట్‌ ఇష్యుకి ళ్లిన భారతీ ఎయిర్‌టెల్‌కు మంచి స్పందన లభించింది. ‘ ప్రాథమిక సమాచారం మేరకు రైట్‌ ఇష్యుకి అధికంగా చందాదారులయ్యారు’ అని బీఎస్‌ఈకి  ఇచ్చే స్టేట్‌మెంట్‌లో కంపెనీ తెలిపింది. రైట్‌ ఇష్యు మొత్తంగా 105 శాతం చందాదారులను రాబట్టుకుందని ఓ ఇన్‌వెస్ట్‌ బ్యాంకర్‌ వివరించారు. ఇష్యు చేసిన మొత్తం 1.3బిలియన్‌ షేర్లలో 690 మిలియన్‌ షేర్లకు  అంటే 61శాతానికి  బిడ్లను  రాబట్టుకుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ డేటా మేరకు తెలుస్తోంది.  అప్పులను తీర్చేందుకు సమీకరించిన మొత్తాలను ఉపయోగించవచ్చు.
 వాక్‌రూ టర్నోవర్‌ టార్గెట్‌ రూ.1000కోట్లు 
యూ4ఐసీ ఇంటర్నేషనల్, వీకేసీ గ్రూపుల నుంచి వచ్చిన దేశియ పుట్‌వేర్‌ సంస్థ వాక్‌రూ నూరు శాతం టర్నోవర్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించడమే  లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ కామర్స్, రిటైల్‌ బిజినెస్‌లలో  మార్కెటింగ్‌ను ఉపయోగించుకొని రూ.500 కోట్లున్న తన టర్నోవర్‌ను రూ. 1000కోట్లకు పెంచేందుకు ప్రణాళికలను  సిద్ధం చేసుకుంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ నాలుగు స్వంత స్టోర్‌లను, ఫ్రాంచైజీ స్టోరులను దక్షిణ భారతదేశంలో  నిర్వహిస్తోంది. ఈ సంఖ్యను భవిష్యత్‌లో పెంచేందుకు ప్రణాళికలున్నాయని కంపెనీ తెలిపింది.
 టీఎస్‌పీఎల్‌కు చైర్మన్‌గా ఆగ్నేస్‌ అగర్వాల్‌
వేదాంతా పవర్‌కు అనుబంధ సంస్థైన  తల్వాండీ సబూ పవర్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌)కు చైర్మన్‌గా ఆగ్నేస్‌ అగర్వాల్‌ను వేదాంత ప్రమోటర్‌ అనిల్‌ అగర్వాల్‌ శుక్రవారం నియమించారు. కంపెనీ కార్యచరణను అభివవృద్ధి  చేస్తూ, ఉన్నతమైన సేవలను అందిస్తూ , కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఈ కొత్త డెవలప్‌మెంట్‌ పనిచేస్తుందని కంపెనీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివరించారు.  పంజాబ్‌లోని తల్వండీ దగ్గర టీఎస్‌పీఎల్‌కు 1,980మె.వా  (మూడు యూనిట్లు, ప్రతి యూనిట్‌ 660 మె.గా)  ఉత్పత్తి చేయగలిగే థర్మల్‌ ప్లాంట్‌ ఉంది. ఆగ్నేస్‌ అగర్వాల్‌ వేదాంతా రీసోర్సెస్‌కి చెందిన యూఏఈలోని ఫుజ్జారై గోల్డ్‌ ఎఫ్‌జడ్‌సీకి చైర్మన్, మానేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. 
అరబిందో 3 ప్లాంటులకు ఓఏఐలుగా అనుమతులు
అరబిందో పార్మాసూటికల్స్‌కు సంబంధించిన మూడు ప్లాంట్‌లను అఫిసియల్‌ యాక్షన్‌ ఇండికేటేడ్‌ (ఓఏఐ)గా  యూఎస్‌ పుడ్‌Š  అండ్‌ డ్రగ్‌ ప్రాధికార సంస్థ నిర్ధారించింది. మూడు యాక్టివ్‌ పార్మాసూటికల్‌ ఇంగ్రేడియంట్స్‌(ఏపీఐ) ప్లాంట్‌లు  యూనిట్‌ 1, 11 తో పాటు మధ్యస్థమైన ప్లాంట్‌ 9ను 2019 ఫిబ్రవరిలో ఓఏఐగా నిర్ణయించింది.   
బీఎస్‌–6 క్లచ్‌లను ఎమ్‌హెచ్‌సీవీకి సరఫరా చేయనున్న సెట్‌కో
వాహనాల విడిì భాగాలను తయారుచేసే సెట్‌కో ఆటో మోటివ్‌ భారి, మధ్యస్థ కమర్షియల్‌ వాహానాలకు(ఎమ్‌హెచ్‌ సీవీ) భారత్‌ స్టేజ్‌–6(బీఎస్‌–6) ఉద్గార నిబంధనలకు లోబడిక్లచ్‌లను సరఫరా చేయడానికి అనుమతి  లభించింది. బీఎస్‌–6 నిబంధనలు దేశమంతటా 2020 ఏప్రీల్‌1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం దేశంలో బీఎస్‌–4 నిబంధనలు అమలులో ఉన్నాయి.  
31షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నా పానాసోనిక్‌
దేశియంగా  పుంజుకునేందుకు 2020కల్లా 31 షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం పానాసోనిక్‌ తెలిపింది. ఈ సోరూమ్‌లను ‘లివింగ్‌ స్టోర్స్‌’గా పిలవనన్నామని, ఇవి లివింగ్‌ కండిషన్‌లను  మెరుగుపరుస్తాయని పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్‌ ఇండియా జాయింట్‌  మేనిజింగ్‌ డైరక్టర్‌ దినేష్‌ అగర్వాల్‌ అన్నారు.  
సీఈఎస్‌సీ క్యూ4లో 9శాతం వృద్ధి
 2018-19 క్యూ4 ఫలితాలను ఇంధన వినియోగ సంస్థ(సీఈఎస్‌సీ) శుక్రవారం విడుదల చేసింది. నికర లాభం 9శాతం వృద్ధితో రూ. 309 కోట్లను చేరింది. క్యూ4 ఆదాయం రూ. 1,734కోట్లుగా  ప్రకటించింది.

  

 You may be interested

బ్లూచిప్‌ స్టాక్స్‌ను నమ్ముకున్న ఫండ్స్‌

Sunday 19th May 2019

లార్జ్‌క్యాప్స్‌... మార్కెట్‌ను ఎటువైపైనా నడిపించేవి ఇవే. కీలకమైన సాధారణ ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్దేశించే ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, బ్లూచిప్‌ స్టాక్స్‌నే ఎక్కువగా నమ్ముకున్నాయి. బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల స్టాక్స్‌లో టాప్‌ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. తదుపరి బుల్‌ ర్యాలీని ముందుకు తీసుకెళ్లేవి ఈ రంగాల స్టాక్స్‌

ఎన్నికల ఫలితాలు డిస్కౌంట్‌ అయ్యాయా?

Saturday 18th May 2019

విజయ్‌ కుమార్‌, అనలిస్టు ఎన్నికల సంగ్రామం ముగిసిపోనుంది. గురువారం సాయంత్రానికి విజేత ఎవరో తెలిసిపోనుంది. అయితే ఆదివారం సాయంత్రం వచ్చే ఎగ్జిట్‌ పోల్స్‌ ఈ విషయమై కొంత స్పష్టత ఇవ్వవచ్చు. అయితే ఇప్పటికే 59 సీట్లకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాయని, కాకపోతే అవి బహిర్గతం చేయలేదని జియోజిత్‌ అనలిస్టు విజయ్‌కుమార్‌ చెబుతున్నారు. పైస్థాయిలో చాలామందికి ఈ ఎగ్జిట్‌పోల్స్‌ అందాయని, దాదాపు పార్టీలన్నింటికీ కూడా ఈ ఫలితాలు తెలిసాయని చెప్పారు. మార్కెట్లో

Most from this category