News


పరిస్థితిని అవకాశాలుగా మలుచుకోవాలి

Saturday 29th February 2020
news_main1582948799.png-32175

  • ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీత రెడ్డి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల్లో కొన్ని సవరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీత రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ఆరు త్రైమాసికాలుగా జీడీపీ పడిపోతూ వస్తోంది. చాలా రంగాల్లో వినియోగం తగ్గింది. గ్రామీణ భారత్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇది ఆందోళన కలిగించే అంశమే. రికవరీకి అంతర్జాతీయంగా వాతావరణం సానుకూలంగా లేదు. దీనికి ఇప్పుడు కరోనా తోడైంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితులను అవకాశాలుగా మార్చుకోవాలి. భారత్‌లో కార్మిక చట్టాలను స్వల్పంగా సవరణ చేయాలి. చైనా నుంచి దిగుమతులు తగ్గుతున్న తరుణంలో దేశీయంగా తయారీ పెరిగితే భారత్‌కు కలిసి వస్తుంది’ అని తెలిపారు. కరోనా భారత్‌కు వ్యాప్తి చెందితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పరిస్థితి ఊహించలేం. ఇక్కడి ఉష్ణోగ్రతలు కాపాడతాయేమో. అలాగే విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ఆ విధంగా నియంత్రించవచ్చు’ అని అన్నారు. 



You may be interested

ఎన్‌సీఎల్‌టీకీ అరబిందో ఫార్మా

Saturday 29th February 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్స్‌ తయారీ కంపెనీ అరబిందో ఫార్మా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అరబిందోకు చెందిన అనుబంధ కంపెనీలు ఏపీఎల్‌ రీసెర్చ్‌ సెంటర్, ఏపీఎల్‌ హెల్త్‌కేర్, ఆరోజైమ్స్, క్యూరెప్రో పేరెంటెరల్స్, హైసింత్స్‌ ప్రై.లి., సిలికాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రై.లి.లను అరబిందో ఫార్మాలో విలీనం (అమాల్గమేషన్‌) చేయాలని కోరుతూ శుక్రవారం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. పిటీషన్‌ను ఆహ్వానించిన ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌

గెలాక్సీ ఎస్‌10 లైట్‌ @ రూ. 44,999

Saturday 29th February 2020

 512జీబీ వేరియంట్‌ విడుదల గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లో 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు (48 మెగాపిక్సెల్ స్టడీ ఓఐఎస్‌, 12ఎంపీ అల్ట్రా-వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్‌) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చింది. 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, క్వాల్కమ్

Most from this category