News


సంక్షోభాన్ని అధిగమించేందుకు చేయూత కావాలి : కేంద్రానికి పరిశ్రమల వినతి

Monday 23rd March 2020
news_main1584930589.png-32618

ఆర్థిక ఉద్దీపనలు..
రుణ చెల్లింపులపై మారటోరియం

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలును తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్‌ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది.
ఏడాది చివరి వరకు విరామం...
కార్పొరేట్‌ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్‌ కోరింది. ఎల్‌ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. ఎంఎస్‌ఎంఈ రుణాలకు కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో స్థిరత్వం కోసం ఈ సూచన చేసింది. మన దేశంపై కోవిడ్‌19 ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్‌.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్‌ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. You may be interested

వాహనాల తయారీకి కరోనా బ్రేక్‌..

Monday 23rd March 2020

ఉత్పత్తి నిలిపివేస్తున్న ఆటోమొబైల్ కంపెనీలు జాబితాలో మారుతీ, హోండా, ఫియట్‌ తదితర సంస్థలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురుగ్రామ్‌, మానెసర్‌లోని (హర్యానా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్‌తక్‌లోని పరిశోధన, అభివృద్ధి

కరోనా కట్టడే కీలకం..!

Monday 23rd March 2020

గురువారం ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగింపు భారీ ఒడిదుడుకులకు ఆస్కారం: మోతీలాల్‌ ఓస్వాల్‌ వైరస్ పరిణామాలతోనే ఈ వారంలో సూచీలకు దిశా నిర్దేశం  న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా) వైరస్ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్ పరిణామాలు

Most from this category