STOCKS

News


కొత్త గిడ్డంగులు వస్తున్నాయ్‌

Monday 27th January 2020
news_main1580094732.png-31218

ముంబై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది హైదరాబాద్‌ సహా ఎనమిది ప్రధాన నగరాల్లో 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన గిడ్డంగులు రానున్నాయి. సరుకు రవాణా రంగంలో గిడ్డంగులు కూడా అంతర్భాగం కావడంతో ఈ స్థాయిలో కొత్తవి ఏర్పాటవుతున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ సావిల్స్‌ నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్‌, రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, ఫార్మా, తయారీ రంగాల్లో గిడ్డంగులకు డిమాండ్‌ అధికమవడంతో ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, డెవలపర్ల నుంచి ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపింది. మేకిన్‌ ఇండియా, జీఎస్టీ, ఎఫ్‌డీఐ పాలసీ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, మెరుగైన మౌలిక వసతులు ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గ్రేడ్‌-సి, గ్రేడ్‌-డి గిడ్డంగుల వద్ద 80 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం ఉంది. వచ్చే మూడు నుంచి అయిదేళ్లలో ఇవి గ్రేడ్‌-ఏ, గ్రేడ్‌-బి గిడ్డంగులుగా మారతాయని అంచనా వేసింది. 



You may be interested

ఇలా చనిపోతే బీమా పరిహారం రాదు

Monday 27th January 2020

అన్నిటికీ కాదు.. కొన్నిటికే పరిహారం టర్మ్‌ పాలసీల్లో కొన్నిటికి మినహాయింపు అనారోగ్యకర అలవాట్లను దాచిపెడితే నష్టపోవాల్సిందే మద్యం మోతాదు మించే వారికి తిరస్కరణలు ప్రమాదకర రైడర్లు, విన్యాసాల వారికీ రిస్కే ప్రత్యేక రైడర్లు ఉంటే పరిహారం కష్టమే పాలసీ తీసుకునే ముందే అన్నీ తెలుసుకోవాలి బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని

5 నెలల్లో 50వేల కియా కార్లు

Monday 27th January 2020

5 నెలల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు ముంబై: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని దాటింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును

Most from this category