News


అపోలో టైర్స్‌ వార్‌బర్గ్‌ పెట్టుబడులు

Thursday 27th February 2020
news_main1582773143.png-32123

  • రూ.1,080 కోట్లు మేర ! 

న్యూఢిల్లీ: అపోలో టైర్స్‌ కంపెనీలో ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌ రూ.1,080 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ కంపెనీకి రూ.1,080 కోట్ల విలువైన తప్పనిసరి కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను జారీ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని అపోలో టైర్స్‌ సీఎమ్‌డీ ఓంకార్‌ ఎస్‌ కన్వర్‌ తెలిపారు. ఈ ప్రతిపాదనకు వాటాదారుల, వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు. తమ వ్యాపారం, ఈ వ్యాపార వృద్ధి అవకాశాలపై నమ్మకంతోనే ప్రపంచంలోనే దిగ్గజ పీఈ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని వివరించారు. ​కాగా అపోలో టైర్స్‌ కంపెనీకి వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, అందుకే ఈ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నామని వార్‌బర్గ్‌ పింకస్‌ ఇండియా ఎమ్‌డీ, విశాల్‌ మహదేవియ వ్యాఖ్యానించారు. 



You may be interested

టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు

Thursday 27th February 2020

ధరల పతనంపై అప్రమత్తం చేసేందుకు వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్‌ (వెబ్‌సైట్‌)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్‌ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది.

2019లో దేశంలో కొత్తగా 34 బిలియనీర్లు

Thursday 27th February 2020

దేశంలో 138కి చేరిన బిలీయనీర్ల సంఖ్య 799 మందితో చైనా నంబర్‌ 1 626 మందితో అమెరికా రెండో స్థానం సంపన్న భారతీయుడు ముకేశే: హరూన్‌ ముంబై: దేశంలో సంపన్నుల సంఖ్య 2019లో ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పెరిగింది. ప్రతీ నెలా సుమారు ముగ్గురు చొప్పున కొత్తగా బిలియనీర్లు పుట్టుకొచ్చారు. మొత్తం మీద 2019లో 34 మంది బిలియనీర్లు అదనంగా జత కూడడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 38కి చేరుకుందని హరూన్‌ గ్లోబల్‌రిచ్‌ లిస్ట్‌ 2020

Most from this category