News


వాల్‌మార్ట్‌కు 282 మిలియన్ డాలర్ల జరిమానా

Saturday 22nd June 2019
news_main1561175608.png-26482

వాషింగ్టన్‌: భారత్‌ సహా నాలుగు దేశాల్లో అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలను సెటిల్‌ చేసుకునేందుకు గాను అమెరికన్ నియంత్రణ సంస్థలకు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ 282 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. నిబంధనలకు విరుద్ధంగా వాల్‌మార్ట్‌ తరఫున థర్డ్‌ పార్టీ మధ్య వర్తులు విదేశాల ప్రభుత్వాధికారులకు చెల్లింపులు జరపడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ధారించడంతో ఇందుకు కారణం. ఎస్‌ఈసీకి 144 మిలియన్ డాలర్లు, న్యాయశాఖ పెట్టిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవడానికి మరో 138 మిలియన్ డాలర్లు.. వెరసి 282 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు వాల్‌మార్ట్ అంగీకరించినట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. చాలా ఉల్లంఘనలను వాల్‌మార్ట్‌ నివారించగలిగేదని, పదే పదే హెచ్చరికలు చేసినా సకాలంలో సూచనలు అమలు చేయకుండా పెడచెవిన పెట్టిందని ఎస్‌ఈసీ పేర్కొంది.



You may be interested

అరబిందోకు యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌

Saturday 22nd June 2019

ఔషధ తయారీ కంపెనీ అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఏపీఐ తయారీ కేంద్రం యూనిట్‌-11లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించిన ఎఫ్‌డీఏ తాజాగా వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. ఈ ఫెసిలిటీలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారంపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అరబిందో అభిప్రాయపడింది.

మార్కెట్లు బుల్లిష్‌... స్టాక్స్‌ బేరిష్‌

Saturday 22nd June 2019

ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి బుల్స్‌ జోరు మీద ఉన్నాయి. సూచీలు దిద్దుబాటుకు లోనవడం, అంతే వేగంగా ఆ నష్టాలను పూడ్చేచుసుకుని మళ్లీ లాభాల మెరుపులు మెరిపించడం చూస్తున్నాం. గతేడాది నుంచి చూసుకుంటే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు భారీగా నష్టపోయినవే. కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లోని ఎంపిక చేసిన కొన్ని షేర్లు ర్యాలీ చేస్తూ సూచీలను బలంగా నిలబెడుతున్నాయి. దీంతో మార్కెట్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి.

Most from this category