News


నిబంధనలు స్థిరంగా ఉండేలా చూడండి: వాల్‌మార్ట్ సీఈవో

Wednesday 23rd October 2019
news_main1571804252.png-29070

- ప్రధాని మోదీకి వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ లేఖ
న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ రంగానికి సంబంధించి డేటా గోప్యతపరమైన సమస్యలు పరిష్కరించాలని, నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో స్థిరత్వం ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీను రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ కోరారు. అలాగే, కొత్త స్టోర్స్‌ ఏర్పాటుకు పొందాల్సిన లైసెన్సులు, పర్మిట్ల సంఖ్యను కూడా తగ్గించాలన్నారు. మెక్‌మిలన్ ఈ మేరకు మోదీకి లేఖ రాశారు. విదేశాల్లో తమ కార్యకలాపాల కోసం భారత్‌ నుంచి వాల్‌మార్ట్‌ మరింత కొనుగోళ్లు జరుపుతుందని, తద్వారా చిన్న సంస్థలు.. ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. "నియంత్రణ వ్యవస్థలు, నిబంధనలకు సంబంధించి స్థిరమైన పరిస్థితులు ఉంటే మరిన్ని పెట్టుబడులు పెట్టడం కొనసాగించేందుకు తోడ్పాటు లభిస్తుంది. వీటితో మరిన్ని ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన జరుగుంది. దీంతో భారత్‍లోని సరఫరాదారులు, కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది" అని మెక్‌మిలన్ పేర్కొన్నారు. ఈ-కామర్స్‌తో పాటు డేటా ప్రైవసీ నిబంధనలు కఠినతరం చేస్తూ కేంద్రం ఇటీవల చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. 



You may be interested

బ్యాంకింగ్‌ సేవలపై సమ్మె పాక్షిక ప్రభావం

Wednesday 23rd October 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్మిక సంఘాలు మంగళవారం నిర్వహించిన సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది. బ్యాంకింగ్‌ రంగంలో విలీనాలు, పొదుపు రేట్లలో కోత వంటి వంటి విధానాలను నిరసిస్తూ, కార్మిక సంఘాలు ఈ ఒకరోజు సమ్మె పిలుపును ఇచ్చాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్‌ క్లియరెన్సులపై ప్రభావం పడినట్లు వార్తలు అందాయి. అయితే ప్రైవేటు రంగ బ్యాంకులు మామూలుగా

పెరిగిన జీఎస్‌కే ఫార్మా లాభం

Wednesday 23rd October 2019

రూ.882 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌(జీఎస్‌కే ఫార్మా) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.503 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత క్యూ2లో రూ.101 కోట్ల నికర లాభం ఆర్జించామని జీఎస్‌కే ఫార్మా తెలిపింది. ఇక ఆదాయం రూ.816 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.401 కోట్ల మినహాయింపు అంశాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. భూ విక్రయం కారణంగా రూ.545

Most from this category