News


టీసీఎస్‌కు రూ.10,650 కోట్ల కాంట్రాక్ట్‌

Tuesday 4th February 2020
news_main1580786548.png-31482

  • డబ్ల్యూబీఏ నుంచి పదేళ్ల కాంట్రాక్టు 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) భారీ కాంట్రాక్ట్‌ను సాధించింది. ఫార్మా కంపెనీ వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయెన్స్‌(డబ్ల్యూబీఏ) నుంచి ఈ కాంట్రాక్ట్‌ను పొందామని టీసీఎస్‌ తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ కాలపరిమితి పదేళ్లని పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా డబ్ల్యూబీఏకు అవసరమైన ఐటీ సర్వీసులను అందిస్తామని వివరించింది. వేగంగా విస్తరిస్తున్న వ్యాపార అవసరాలను సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు టీసీఎస్‌తో భాగస్వా‍మ్యం ఉపకరించగలదని డబ్ల్యూబీఏ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కూడా అయిన ఫ్రాన్సెస్కో టింటో పేర్కొన్నారు. 



You may be interested

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?!

Tuesday 4th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌ సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌ అటూఇటుగా ఆసియా మార్కెట్లు నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు పుంజుకుని 11,745 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..

ఉద్యోగుల ప్రయోజనాలూ పరిరక్షిస్తాం

Tuesday 4th February 2020

అడ్డగోలుగా తీసివేయడం కుదరదు ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయాలపై కేంద్రం వివరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటాలను విక్రయించినప్పటికీ.. ఉద్యోగుల ప్రయోజనాలను కూడా పరిరక్షించే విధంగా షేర్ల విక్రయ ఒప్పందాల్లో నిబంధనలు ఉంటాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత తెలిపారు. కొనుగోలు చేసిన సంస్థలు.. అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించేందుకు ఉండబోదని పేర్కొన్నారు. ఎయిరిండియా, బీపీసీఎల్‌ బిడ్డింగ్ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని చెప్పారు. నష్టాలు,

Most from this category