News


మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌ టీ-రాక్‌

Thursday 19th March 2020
news_main1584588004.png-32569

- ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు 

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌.. ‘టీ-రాక్‌’ పేరిట తన సరికొత్త స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చిన ఈ కారు ధర రూ. 19.99 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాతన ఎస్‌యూవీ 8.4 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్‌ స్పీడ్‌ 205 కి.మీటర్లుగా కంపెనీ ప్రకటించింది. స్పోర్టీ డిజైన్ కలిగిన ఈ కారు.. భద్రత, సాంకేతికత పరంగా మరింత పటిష్టంగా ఉందని కంపెనీ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ అన్నారు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6-ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లుతో కారు విడుదలైందని చెప్పారు. ఏప్రిల్‌ మూడో వారం నుంచి డెలివరీలు ప్రారంభంకానుయని వెల్లడించారు.



You may be interested

బాకీ మొత్తం కట్టాల్సిందే..

Thursday 19th March 2020

- స్వీయ మదింపులు కుదరవు - తప్పుడు వార్తలకు టెల్కోల ఎండీలదే బాధ్యత - కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం - ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ - టెల్కోలు, కేంద్రానికి అక్షింతలు న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత  బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ నేడు!

Thursday 19th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 369 పాయింట్లు డౌన్‌ ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం అమెరికా, యూరప్‌, ఆసియా నేలచూపు నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 369 పాయింట్లు పడిపోయి 8,073 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,442 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

Most from this category