News


వొడాఫోన్‌ ఐడియాకు రూ.4,874 కోట్ల నష్టాలు

Saturday 27th July 2019
news_main1564201996.png-27348

  • ఆదాయం రూ.11,270 కోట్లు

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కన్సాలిడేటెడ్‌ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ రెండూ 2018 ఆగస్ట్‌ 31 నుంచి విలీనమై వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలను పోల్చి చూడడం సరికాదు. జూన్‌ క్వార్టర్‌లో ఆదాయం మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.11,775 కోట్ల నుంచి రూ.11,270 కోట్లకు తగ్గింది. కొంత మంది కస్టమర్లను కోల్పోవడం, ఉన్న కస్టమర్లలో కొంత మంది తక్కువ విలువ కలిగిన ప్లాన్లకు మారిపోవడం, సగటు యూజర్‌ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం (ఏఆర్‌పీయూ) ప్రభావం చూపించాయి. ‘‘మేము చెప్పిన విధానాన్నే ఆచరణలో అమలు చేస్తున్నాం. దీని తాలూకూ ఫలితాలు ఇంకా కనిపించలేదు. మా నెట్‌వర్క్‌ అనుసంధానత, కస్టమర్ల డేటా వినియోగ అనుభవం చాలా ‍ప్రాంతాల్లో మెరుగుపడింది’’ అని వొడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు 4జీ కవరేజీ విస్తరణపై దృష్టి కొనసాగుతుందని, డేటా సామర్థ్యాలను కూడా పెంచుకుంటామని చెప్పారు. జూన్‌ త్రైమాసికంలో రూ.2,840 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని, స్థూల రుణ భారం రూ.12,044 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ యూజర్ల సంఖ్య 33.4 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గడం గమనార్హం. 



You may be interested

వేదాంత లాభం రూ.1,351 కోట్లు

Saturday 27th July 2019

12 శాతం డౌన్‌ నిర్వహణ లాభం రూ.5,578 కోట్లు  న్యూఢిల్లీ: మైనింగ్‌ కంపెనీ, వేదాంత నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ. 1,533 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,351 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. కమోడిటీ ధరలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని వేదాంత సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.22,624

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు..?

Saturday 27th July 2019

వ్యవస్థలో తగ్గిన వినియోగం ప్రభుత్వ మద్దతు చర్యలు నామమాత్రం వ్యవస్థలో నగదు లభ్యత తక్కువ ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం దీంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లకు నష్టాలు కొంత కాలం పాటు ఇదే పరిస్థితి దీర్ఘకాలం కోసమే ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచన న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి

Most from this category