News


వొడాఫోన్‌ ఐడియా మూసేస్తాం!

Friday 6th December 2019
news_main1575627798.png-30096

ప్రభుత్వ సాయం అందకుంటే నడపలేం
కుమార మంగళం బిర్లా
ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట లభించకుంటే వొడాఫోన్‌ ఐడియా మూతపడడం ఖాయమని బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘‘ఏలాంటి సాయం రాకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ కంచికి చేరినట్లే’’ అని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్న బిర్లా వెల్లడించారు. ఇప్పటికే వొడాఫోన్‌ గ్లోబల్‌ సీఈఓ సైతం ఇదే విషయాన్ని బయటపెట్టారు. జియో పోటీ తట్టుకునేందుకు వొడాఫోన్‌, ఐడియాలు గతేడాది విలీనమైనాయి. అనంతరం సంస్థ పనితీరు కుంటుపడుతూ వచ్చింది. ఇప్పటికే సంస్థ నెత్తిన భారీగా రుణభారం ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కంపెనీకి అశనిపాతంగా మారింది. క్యు2లో కంపెనీ భారీ నష్టాలు నమోదు చేసింది. ఈ క్రమంలో పనికిరాని విషయాలపై కష్టపడి ఆర్జించిన మొత్తాలను పెట్టడం మంచిది కాదని, అలా చేయాల్సి వస్తే దుకాణం మూసేయడమే మంచిదని, తాము అదే చేస్తామని బిర్లా తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో రుణభారాల నుంచి విముక్తికి ప్రమోటర్లు కంపెనీకి ఎలాంటి సాయం చేసేందుకు సిద్ధంగా లేరని స్పష్టమైంది. ఇప్పటికైతే ఏజీఆర్‌ తీర్పుపై కంపెనీతో సహా ఎయిర్‌టెల్‌ కూడా రివ్యూ పిటీషన్‌ దాఖలు చేశాయి.

ఈ నేపథ్యంలో ‘‘టెలికం రంగం చాలా కీలకమైనదని ప్రభుత్వం గ్రహించింది, డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఈ రంగంపై ఆధారపడి ఉంది. ఇది ఒక వ్యూహాత్మక రంగం. అందువల్ల ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు ఆశించవచ్చు. ఈ రంగం కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే కంపెనీ మూత ఖాయం.’’ అని కుమార మంగళం చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం టెల్కోల స్పెక్ట్రం బకాయిల చెల్లింపు కాలపరిమితి పెంచింది. కానీ అసలు సమస్య ఏజీఆర్‌ బకాయిలని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని బిర్లా కోరారు. టెల్కోలపై కేసులో ప్రభుత్వం గెలిచినందున ఇప్పుడు ఒక తీరైన పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. రివ్యూ పిటీషన్‌ విచారణలో ప్రభుత్వం ఏం చెబుతుందో తెలీదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. You may be interested

మార్కెట్‌ను వెంటాడిన వృద్ధి భయాలు

Friday 6th December 2019

ఆర్థిక వృద్ధి ఆందోళనలతో లాభాల స్వీకరణ 12వేల దిగువున ముగిసిన నిఫ్టీ  334 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ ఆర్థిక వృద్ధి ఆందోళనతో ఇన్వెస్టర్లు​లాభాల స్వీకరణకు పూనుకోవడంతో శుక్రవారం సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టపోయి 40,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమైన 12వేల దిగువన 11,914 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగి ఆర్థిక రంగ షేర్లైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 5శాతం పతనం

రిలయన్స్‌ టార్గెట్‌ రూ.2,010: సీఎల్‌ఎస్‌ఏ

Friday 6th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇటీవల కాల్‌, డేటా సేవలపై సుంకాలను 35శాతం పెంచడంతో నిర్వహణ లాభం 1.1 బిలియన్ డాలర్ల నుండి 1.3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.2,010లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ‘‘రిలయన్స్‌ జియో కాల్‌,

Most from this category