News


కేంద్రం వద్దకు వొడాఫోన్‌-ఐడియా

Saturday 26th October 2019
news_main1572064209.png-29153

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్‌-ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్‌) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 21,000 కోట్లు కట్టాల్సి రానుంది. 



You may be interested

టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు

Saturday 26th October 2019

44 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు  లాభాల బాటలో జేఎల్‌ఆర్‌ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణ  న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న  మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచ్చిన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోల్చితే నష్టాలు బాగానే తగ్గాయి.  గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం

మెరుపులు తగ్గిన ధంతేరాస్‌

Saturday 26th October 2019

దేశీయంగా అమ్మకాలు 40 శాతం డౌన్‌ అధిక పుత్తడి ధరే ఇందుకు కారణం  చిన్న ఆభరణాలకే కస్టమర్ల మొగ్గు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ధంతేరాస్‌కు పుత్తడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 40 శాతం దాకా తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన పసిడి ధరకుతోడు కస్టమర్ల వ్యయాలు తగ్గడం ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2018 ధంతేరాస్‌తో పోలిస్తే ప్రస్తుత పుత్తడి ధర

Most from this category