News


సాయం కోసం ప్రభుత్వం చెంతకు..

Saturday 26th October 2019
news_main1572086100.png-29169

వొడాఫోన్‌ ఐడియా యత్నాలు
లేదంటే దివాలా తప్పదని నిపుణుల అంచనా
సుప్రీం కోర్టు తీర్పుతో భారీ ఇబ్బందుల్లో పడిన వొడాఫోన్‌ ఇండియా, సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని యోచిస్తోంది. లైసెన్సు ఫీజు బకాయిలపై జరిమానాలు, వడ్డీలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోతే కంపెనీ మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు పలు ఆర్థిక చిక్కులకు దారితీస్తుందని కంపెనీ సైతం భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఊరట కోసం డీఓటిని సం‍ప్రదించే యోచనలో ఉన్నామని తెలిపింది. స్టాక్‌మార్కెట్లో కంపెనీ షేరు విపరీతంగా క్షీణిస్తూ క్రమంగా రూ.4 వద్దకు దిగజారింది. దీంతో కంపెనీ భవితవ్యంపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 


ససేమిరా అంటుందా
వొడాఫోన్‌ ఐడియా కోరే ఉపశమనాలను ప్రభుత్వం అనుమతించకపోతే డీఓటీ, బ్యాంకర్లు, ప్రమోటర్లు, కస్టమర్లపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుందని టెలికం నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఉపశమనం కల్పించకపోతే కంపెనీ దివాలా దిశగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిస్తుందని, ఇదే జరిగితే కంపెనీకి సంబంధించిన అందరు వాటాదారులకు నష్టం వాటిల్లుతుందని ఐఐఎఫ్‌ఎల్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. కంపెనీ దివాలాతో ప్రభుత్వానికి సైతం రూ.12వేల కోట్ల వార్షిక చెల్లింపుల రూపంలో నష్టం వాటిల్లుతుందని తెలిపింది. దివాలాయత్నాలు ఆరంభమైతే కంపెనీపై మాతృసంస్థల పట్టు పోయి బ్యాంకులకు పట్టువస్తుందని వివరించింది. ఇది కంపెనీకి చెందిన 32 కోట్ల మంది కస్టమర్ల సేవలపై పెను ప్రభావం చూపవచ్చని తెలిపింది. క్రెడిట్‌సూసీ తదితర బ్రోకరేజ్‌లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీకి తక్షణం మూలదన సాయం అవసరమని తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో షేరు ధర క్షీణించినందున మరింత వాటా విక్రయించినా, కంపెనీకి కావాల్సిన మొత్తం సమకూరదని లెక్కించాయి. ఒకపక్క కస్టమర్లు తగ్గిపోతూ, ఆదాయోత్పత్తి కుంచించుకుపోతున్న సమయాన ఈ పరిస్థితి ఎదురుకావడం కంపెనీపై పిడుగుపాటని, ప్రభుత్వం ఉపశమనం కల్పించడం లేదా కంపెనీకి ఎటునుంచైనా మూలధన సాయం అందడం జరగకపోతే దివాలా దిశగా పయనించవచ్చని ఎక్కువమంది అనలిస్టుల అంచనా. You may be interested

బ్యాంకింగ్‌ షేర్లలో పెట్టుబడులా ..? అయితే ఇవి కీలకం

Saturday 26th October 2019

బ్యాంకులు ప్రధాన వ్యాపారం రుణాలను ఇవ్వడం, తీసుకోవడం. రుణాలు ఇచ్చే ప్రధాన కార్యకలాపాల కోసం బ్యాంకులు విరివిగా నిధులను అప్పుగా తీసుకుని, ఈ మొత్తాలను తమ వినియోగదారులకు రుణాలుగా ఇస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియా ద్వారా కూడా బ్యాంకులు ఆదాయాలను ఆర్జిస్తాయి. బ్యాంకు షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  నికర వడ్డీ ఆదాయం:- వడ్డీ మార్జిన్ లేదా రుణాలు, పెట్టుబడులు, నిధుల వ్యయం వంటి

సంవత్‌ 2076 కోసం టాప్‌ 10 ముహూరత్‌ స్టాకులు!

Saturday 26th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్‌ నుంచి పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 11,500 పైన ట్రేడవుతుండగా, సెన్సెక్స్‌ 39,000 స్థాయికి పైన ట్రేడవుతోంది. మార్కెట్‌లో సెంటిమెంట్‌ పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో సంవత్‌ 2076 కోసం ఏయూఎం క్యాపిటల్‌ టాప్‌ 10 స్టాకులను సిఫార్సు చేస్తోంది... బ్రోకరేజి: ఏయూఎం క్యాపిటల్‌ బజాజ్‌ ఆటో: ద్విచక్ర, త్రి చక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో కీలకమైన కంపెనీగా ఉంది. ఈ కంపెనీ 79 దేశాలలో తన

Most from this category