News


వీఐఎల్‌ నిష్క్రమిస్తే ఎయిర్‌టెల్‌, జియోలపై ఆర్థిక భారం?!

Tuesday 18th February 2020
news_main1582000684.png-31882

రెండు కంపెనీల క్యాపెక్స్‌, ఓపెక్స్‌ల్లో పెరుగుదల
దీర్ఘకాలానికి ప్రయోజనమేనంటున్న నిపుణులు
ముందునుంచి హెచ్చిరిస్తున్నట్లుగానే వొడాఫోన్‌ ఐడియా మూసివేస్తే అది ఎయిర్‌టెల్‌, ఆర్‌జియోల మూలధన, కార్యనిర్వాహక వ్యయాలు(క్యాపెక్స్‌, ఓపెక్స్‌) పెరిగేందుకు దోహదం చేస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు. అయితే స్వల్పకాలానికి ఈ వ్యయాల పెరుగుదల భారం పడినా తర్వాత కాలంలో రెండు కంపెనీల కస్టమర్‌ బేస్‌లో బలమైన పెరుగుదల సంభవిస్తుందని, చివరకు టెలికంలో రెండు దిగ్గజాల రాజ్యం ఏర్పడుతుందని విశ్లేషించారు. దాదాపు 30 కోట్ల కస్టమర్లున్న వీఐఎల్‌ దివాలా తీస్తే ఎయిర్‌టెల్‌ ఓపెక్స్‌ 15-20 శాతం మేర పెరగవచ్చని బ్యాంక్‌ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ప్రస్తుత టవర్‌ షేరింగ్‌ ఒప్పందాల రివర్సల్‌ కారణంగా ఓపెక్స్‌, క్యాపెక్స్‌లు పెరుగుతాయని తెలిపింది. కానీ అంతిమంగా జియో, ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ వాటా పరంగా భారీగా లాభపడతాయని తెలిపింది. ఈ రెండిటిలో ఏజీఆర్‌ బకాయిలు పెద్దగా లేని జియో ఇన్ఫోకామ్‌ అత్యుత్తమ లబ్ది పొందుతుందని, బాలెన్స్‌ షీటుపై పెద్దగా ఒత్తిడి లేకుండానే 5జీ పెట్టుబడులు పెట్టగలుగుతుందని విశ్లేషించింది. వీఐఎల్‌ కస్టమర్లను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదని, రెండు కంపెనీలు నెట్‌వర్క్‌ సామర్ధ్య పెంపు, తాజా స్పెక్ట్రం కొనుగోళ్లకు భారీగా వెచ్చించాల్సివస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే తర్వాత కాలంలో ఈ పెట్టుబడులకు తగ్గ ప్రయోజనాలుంటాయన్నారు. 


వీఐఎల్‌ స్పెక్ర్టం విలువ దాదాపు 1400 కోట్ల డాలర్లుంటుందని, ఎయిర్‌టెల్‌, జియోలు ప్రభుత్వంతో బేరమాడి ఈ వీఐఎల్‌ స్పెక్ట్రాన్ని తక్కువ ధరకు కొనాల్సిఉంటుందని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రెండు సంస్థలు మాత్రమే నిలిచేట్లయితే వీఐఎల్‌ కస్టమర్లను జియో, ఎయిర్‌టెల్‌ 40:60 నిష్పత్తిలో పొందుతాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. దీంతో రెండు కంపెనీల ఎబిటాలు వరుసగా 29, 22 శాతం మేర దూసుకుపోవచ్చని పేర్కొంది. వీఐఎల్‌ డిఫాల్టయితే జియో తన 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ను మరింత ఉధృతంగా మార్కెట్‌ చేయాల్సిఉంటుంది. ఎందుకంటే వీఐఎల్‌ కస్టమర్లలో ఎక్కువమంది 2, 3జీ నెట్‌వర్క్‌ వాడకందారులున్నారు. వీరిని 4జీవైపు తీసుకువస్తే జియోకి మేలు కలుగుతుంది లేదంటే వీరంతా ఎయిర్‌టెల్‌ను ఎంచుకోవచ్చని నిపుణుల భావన. మరోవైపు వీఐఎల్‌ పతనమైతే అనంతర స్పెక్ట్రం వేలాల్లో పాల్గొనడం ఎయిర్‌టెల్‌కు కూడా భారం కావచ్చని, ఏజీఆర్‌ బకాయిలు చెల్లించిన అనంతరం మరలా పెట్టుబడులంటే ఎయిర్‌టెల్‌వద్ద నిధుల కొరత ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. వీఐఎల్‌ డిఫాల్టైతే ఆ కంపెనీ ఎయిర్‌వేవ్స్‌ను ప్రభుత్వం డిస్కౌంట్‌ ధరకు వేలం వేయవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా వొడాఫోన్‌ ఐడియా మూతపడితే అది మిగిలిన రెండు కంపెనీలకు స్వల్పకాలానికి ఆర్థిక భారాన్ని, దీర్ఘకాలానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణుల అంచనా. You may be interested

భారీగా పెరిగిన పుత్తడి!

Tuesday 18th February 2020

 మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.200 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,964.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే 3 డాలర్లు​ పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,589.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల

భారత్‌...ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

Tuesday 18th February 2020

ఇదిలాఉండగా 2019లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను అధిగమించి భారత్‌ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అమెరికాకు చెందిన విశ్లేషణా సంస్థ- వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్‌ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్‌లుగా లెక్కగట్టింది. బ్రిటన్‌ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్‌లుగా, ఫ్రాన్స్‌కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్‌లుగా సర్వే పేర్కొంది. 

Most from this category