STOCKS

News


ఐడియా నష్టాలు రూ.6,439 కోట్లు

Friday 14th February 2020
news_main1581648411.png-31770

  • ఏజీఆర్‌, తరుగుదల ప్రభావం 
  • 5 శాతం తగ్గిన ఆదాయం 


న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ చెప్పారు. మరిన్ని వివరాలు.....

30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు...
గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. 

టారిఫ్‌లతో పెంపుతో మెరుగుపడుతున్న ఆదాయం...
ఏజీఆర్‌కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్‌, నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్‌లను పెంచడం వల్ల సెప్టెంబర్‌ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో టారిఫ్‌లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. కాగా వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.53,000 కోట్ల మేర ఉన్నాయి. 



You may be interested

ఐఆర్‌సీటీసీ....4 నెలలు... 5 రెట్లు

Friday 14th February 2020

ఐఆర్‌సీటీసీ షేర్‌ జోరు ఆపతరమా !  దలాల్‌ స్ట్రీట్‌లో దూసుకుపోతున్న రైల్వే కంపెనీ  లిస్టింగ్‌లోనే రెండింతలైన షేరు​ నాలుగు నెలల్లో ఐదు రెట్ల లాభం ఐఆర్‌సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్‌... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత

ఇండియా రేటింగ్స్‌ యథాతథం: ఎస్‌ అండ్‌ పీ

Thursday 13th February 2020

భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను యథాతథంగా ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్స్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ఽ పూర్‌ (ఎస్‌ అండ్‌ పీ) గురువారం ప్రకటించింది. భారత్‌ జీడీపీ వృద్ధి వచ్చే రెండు, మూడేళ్లలో క్రమేపీ దీర్ఘకాలిక సగటుస్థాయికి చేరుకుంటుందని ఎస్‌ అండ్‌ పీ అంచనావేసింది. అయితే పెరిగిన ద్రవ్యలోటు, పెరుగుతున్న ప్రభుత్వ రుణాల కారణంగా కొంత అనిశ్చితి వుందని రేటింగ్స్‌ సంస్థ హెచ్చరించింది. భారత్‌ ఆర్థికాభివృద్ధిరేటు 2019-2020లో 5 శాతానికి తగ్గుతుందని,

Most from this category