News


మరో రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌ ఐడియా

Thursday 20th February 2020
news_main1582189827.png-31962

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్‌ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంగతి తెలిసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్‌ రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది.

మరో ఒకటి, రెండు రోజుల్లో పూర్తి బకాయిల చెల్లింపుల కోసం టాటా టెలీ సర్వీసెస్‌కు  నోటీసులు జారీ చేస్తామని డీఓటీ వర్గాలు తెలిపాయి.  టాటా టెలిసర్వీసెస్‌ మొత్తం రూ.14వే కోట్లు చెల్లించాల్సి ఉండగా, సోమవారం కంపెనీ రూ.2,197 కోట్లను చెల్లించింది. 



You may be interested

ఈ మూడు చిన్న షేర్లకూ రెక్కలు!

Thursday 20th February 2020

థామస్‌ కుక్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ జూమ్‌ ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మూడు స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. జాబితాలో థామస్‌ కుక్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చోటు చేసుకున్నాయి., వివరాలు చూద్దాం..  థామస్‌ కుక్‌ ఇండియా ఇటీవల కొంత కాలంగా పతన బాటలో సాగిన

ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు...?

Thursday 20th February 2020

రోజురోజుకి బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.కోవిడ్‌-19 ప్రభావంతో గురువారం ప్రపంచ మార్కెట్లో ఏడేళ్లగరిష్టానికి పసిడి ధరలు చేరుకున్నాయి. అయితే వైరస్‌ ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడకుండా  చైనా కొన్ని సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర దాదాపు 2 వేల డాలర్లకు చేరే అవకాశం ఉందని సిటీగ్రూపుకు చెందిన కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఫ్యూచర్‌లో ఔన్స్‌ బంగారం ధర 8.20 డాలర్లు

Most from this category