News


వొడాఫోన్‌ ఐడియాపై రేటింగ్‌ సంస్థల డేగకన్ను!

Saturday 16th November 2019
news_main1573882969.png-29639

వారంలో మరో డౌన్‌గ్రేడింగ్‌ ఛాన్సులు
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియా కంపెనీ(వీఐఎల్‌)పై రేటింగ్‌ కంపెనీలు నిశితంగా దృష్టి సారించాయి. రూ. 51వేల కోట్ల నష్టం ప్రకటించిన వీఐఎల్‌ తన అప్పుల నుంచి ఎలా బయటపడుతుందోనని ఏజన్సీలు పరిశీలిస్తున్నాయి. గత నెల సుప్రీం తీర్పుఅనంతరం క్రిసిల్‌, కేర్‌ రేటింగ్స్‌లు వీఐఎల్‌పై నెగిటివ్‌ క్రెడిట్‌వాచ్‌ను ఉంచాయి. దీంతో పాటు  వీఐఎల్‌ బ్యాంకు లోన్‌ సదుపాయాన్ని, ఎన్‌సీడీలను కేర్‌ రేటింగ్స్‌ ఏ నుంచి ఏ మైనస్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. క్రిసిల్‌ సంస్థ వీఐఎల్‌ బాండ్స్‌ రేటింగ్‌ను ఏ నుంచి బీబీబబీ ప్లస్‌కు తగ్గించింది. క్యు2 ఫలితాల అనంతరం కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను రేటింగ్‌ ఏజన్సీలు మరింత తగ్గించవచ్చని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. వీఐఎల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను జంక్‌ కేటగిరీకి డౌన్‌గ్రేడ్‌ చేయవచ్చని, వారంలో ఈ నిర్ణయం రావచ్చని తెలిపాయి. బీబీబీ- కు దిగువన ఏ రేటింగ్‌నైనా జంక్‌ కేటగిరీగా పరిగణిస్తారు. గత నెల డౌన్‌గ్రేడింగ్‌ అనంతరం ఎప్పటికప్పుడు కంపెనీ పరిస్థితిపై ఏజన్సీలు సమావేశాలు జరుపుతూనే ఉన్నాయని సదరు వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం సాయం అందించాలని నిర్ణయించుకుంటే వీఐఎల్‌కు లైఫ్‌లైన్‌ దొరికనట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైతే దేశీయ టెలికం రంగంలలో నియంత్రణాపరమైన అస్థిరతలు ఎక్కువయ్యాయని, అనూహ్య నియంత్రణా నిబంధనల మార్పులకు వీఐఎల్‌ బలయ్యే ఛాన్సులెక్కువని కేర్‌ రేటింగ్స్‌ వ్యాఖ్యానించింది. 

 



You may be interested

రూ.38వేల దిగువన పసిడి

Saturday 16th November 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర శుక్రవారం రూ.38వేల దిగువన ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండోరోజూ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ పసిడి ధర నష్టాల బాట పట్టింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.272లు నష్టపోయి రూ.37994.00 వద్ద స్థిరపడింది. దేశీయంగా వారం మొత్తం మీద 10గ్రాముల పసిడి ధర రూ.307లు లాభపడింది. ట్రేడ్‌

రికార్డుల మోతమోగించిన అమెరికా మార్కెట్లు!

Saturday 16th November 2019

 అమెరికా ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికి అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరగడంతో శుక్రవారం సెషన్‌లో యుఎస్‌ ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డులను తాకాయి. యుఎస్‌​ డోజోన్స్‌ శుక్రవారం సెషన్‌లో మొదటిసారిగా 28,000 స్థాయిని తాకింది. దీంతో వరుసగా నాలుగు వారాలలో డోజోన్స్‌ లాభాల్లో ముగిసినట్టయ్యింది. అంతేకాకుండా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ వరుసగా ఆరో వారంలో కూడా  లాభాల్లో ముగిసింది. దీంతో ఈ ఇండెక్స్‌

Most from this category