News


వీఐఎల్‌ బ్యాంకు గ్యారెంటీలకు భయం లేదు!

Wednesday 19th February 2020
news_main1582087363.png-31917

వొడాఫోన్‌ ఐడియా బకాయిలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సొమ్ముచేసుకునే ఉద్దేశంలో(ఇన్‌వోక్‌ చేయడం) లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం రంగ సంక్షోభ నివారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం ఇతర బకాయిల చెల్లింపులను వాయిదా వేయడం లాంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీంతో ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు కాస్త సులభతరం కావచ్చని తెలిపాయి. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చల దశలో ఉన్నాయన్నారు. బ్యాంకు గ్యారెంటీలను ప్రభుత్వం ఇన్‌వోక్‌ చేయడమంటే టెలికం లైసెన్సులు రద్దు చేయడానికి అడుగులు వేసినట్లేనని, ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకునేముందు చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే సంక్షోభం నుంచి అంతా బయటపడే ఉమ్మడి పరిష్కారమార్గానికి అన్వేషణ జరుగుతోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఏ ఒక్క టెల్కోకూడా బకాయిలు చెల్లించలేక డిఫాల్ట్‌ కాకూడదనే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో వీఐఎల్‌ డిమాండ్‌ చేస్తున్న రూ.7వేల కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను ఈ బకాయిల కింద సర్దుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. 
మంగళవారం బిర్లా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా టెలికం శాఖ అధికారులను కలిసారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తాజా ఆదేశాల అనంతరం ఎలా ముందుకు పోవాలనే విషయంపైనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి అటు కార్పొరేట్‌, ఇటు జుడిషరీ మధ్య ఇరుక్కున్నట్లయిందని, టెల్కోలకు ఏదైనా రిలీఫ్‌ అందిస్తే అటు రాజకీయ విమర్శలకు తోడు కోర్టు అక్షింతలు కూడా పడొచ్చని ప్రభుత్వం సందేహిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై తీవ్రంగా ఫోకస్‌ చేస్తోందన్నారు. మరోవైపు ఏజీఆర్‌ బకాయిల లెక్కల మదింపులో అటు డీఓటీకి ఇటు టెల్కోలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఎయిర్‌టెల్‌ పరిస్థితి బకాయిల చెల్లింపునకు అనుగుణంగానే ఉన్నా, వీఐఎల్‌ పరిస్థితి మాత్రం బాగాలేదు. కనీసం కంపెనీ తాను మదింపు చేసిన మేర రూ. 23వేల కోట్లను కూడా చెల్లించే పరిస్థితిలో కంపెనీ లేదు. ఒకవేళ వీఐఎల్‌ మూతపడితే దాని ప్రభావం కేవలం టెలికం మీద మాత్రమే కాకుండా, అటు బ్యాంకులు ఇటు ఎకానమీపై కూడా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇంతగా యోచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వొడా డిఫాల్ట్‌ దేశ విత్తలోటును 40 బీపీఎస్‌ మేర పెంచవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తొందరపడి వీఐఎల్‌ బ్యాంకుగ్యారెంటీలను సొమ్ము చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. You may be interested

టెక్నికల్‌ రికమండేషన్స్‌- షార్ట్‌ టెర్మ్‌!

Wednesday 19th February 2020

నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం వంటి అంశాల కారణంగా ప్రారంభంలోనే సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ 41,200 స్థాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,100 పాయింట్లను దాటి కదులుతోంది.ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాల ఆధారంగా స్వల్ప కాలానికి మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని

ట్రిపుల్‌ సెంచురీతో సెన్సెక్స్‌ ప్రారంభం

Wednesday 19th February 2020

ప్రారంభంలోనే నిఫ్టీ లాభాల సెంచరీ 41,250 పాయింట్లను దాటేసిన సెన్సెక్స్‌ 12,100 స్థాయిని అధిగమించిన నిఫ్టీ నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. 364 పాయింట్లు జంప్‌చేసి 41,259కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది. 111 పాయింట్లు ఎగసి 12,103ను తాకింది. కరోనా

Most from this category