STOCKS

News


ప్రభుత్వానికి వొడాఫోన్‌ సీఈఓ క్షమాపణ!

Thursday 14th November 2019
news_main1573705103.png-29577

తమ కంపెనీ జాయింట్‌ వెంచర్‌(వొడాఫోన్ ఐడియా) గురించి చేసిన వ్యాఖ్యలకు వొడాఫోన్‌ సీఈఓ నిక్‌రెడ్‌ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని వివరించారు. తన వార్తల కవరేజ్‌ తన అభిప్రాయాన్ని సరిగా వ్యక్తీకరించలేదన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి, టెలికం మంత్రికి లేఖ రాశారు. భారత్‌లో వ్యాపారం కొనసాగించాలన్న తమ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమ ఇబ్బందులపై పరిశీలన జరిపేందుకు కార్యదర్శులతో కూడిన కమిటీ ఏర్పాటుచేయడాన్ని ఆయన స్వాగతించారు. రెడ్‌ ఇటీవల వీఐఎల్‌పై, భారత్‌లో వ్యాపారంపై చేసిన వ్యాఖ్యల పట్ల టెలికం ఉన్నతాధికారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో రెడ్‌ తన మాటల నుంచి వెనక్కు తగ్గినట్లు తెలిసింది.

ప్రభుత్వం టెలికం రంగానికి రిలీఫ్‌ ప్యాకేజీ సిద్ధం చేసేందుకు యత్నించడంపై రెడ్‌ తన లేఖలో హర్షం వ్యక్తం చేశారు. తన గత వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ భారత్‌లో వ్యాపారం సంధిదశకు చేరిందని చెప్పానని, అదికూడా టెలికం రంగ ఆర్థిక పరిస్థితులను బట్టి చెప్పానని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై నియమించిన కార్యదర్శుల కమిటీ టెలికం రంగానికి కొన్ని ఊరటలను సిఫార్సు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏజీఆర్‌ను 8 నుంచి 5 శాతానికి తగ్గించడం, స్పెక్ట్రం పాత బకాయిలపై రెండేళ్ల మారిటోరియం విధించడం లాంటి చర్యలను కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఇవి అమలైతే వొడాఫోన్‌ ఐడియాకు నిధుల పరంగా చాలా ఊరట లభిస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకొనే తాను తొందరపడినట్లు రెడ్‌ గ్రహించి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిఉంటారని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్‌ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా తమ కంపెనీ పనిచేస్తుందని, భారత్‌తో ఉన్న దీర్ఘకాల అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాము కొనసాగుతామని రెడ్‌ తన లేఖలో చెప్పారు. You may be interested

సింగపూర్‌లోనూ భీమ్ యాప్‌

Thursday 14th November 2019

సింగపూర్‌: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌.  అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ జావేద్ అష్రాఫ్‌... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను  (ఎస్‌జీక్యూఆర్‌) స్కాన్‌ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్‌ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి

నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కంపెనీలు

Thursday 14th November 2019

భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, వోడాఫోన్‌ ఐడియా, సెయిల్‌, గ్రాసీం ఇండస్ట్రీస్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌, ఎంటీఎన్‌ఎల్‌, జీవీకే పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జీఎంఆర్‌ ఇన్ఫ్రా, యూనిటెక్‌, పీఎఫ్‌సీ, రిలయన్స్‌ పవర్‌, సద్భవన్‌ ఇంజనీరింగ్స్‌, డిష్‌ టీవీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ప్రభాత్‌ డైరీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, హెచ్‌సీసీ, అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, మెయిల్‌, ఐడీఎఫ్‌సీ, ఫ్యూచర్‌ రిటైల్‌,

Most from this category