News


కొద్ది రోజుల్లో కొంత చెల్లిస్తాం: వొడాఫోన్‌ ఐడియా

Sunday 16th February 2020
news_main1581843334.png-31830

వ్యాపార మనుగడపై ఇంకా అనిశ్చితి

కొద్ది నెలలుగా టెలికాం రంగాన్ని కుదిపేస్తున్న ఏజీఆర్‌ బకాయిల్లో ప్రస్తుతానికి ఎంతమేరకు చెల్లించగలమో లెక్కవేస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అయితే కంపెనీ మనుగడసాగించడంపై మాత్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల గడువు పెంపును కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై వచ్చే తీర్పు ఆధారంగా తమ వ్యాపార మనుగడ ఆధారపడివుంటుందని వొడాఫోన్‌ ఐడియా శనివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. కంపెనీ రూ. 52,000 కోట్ల వరకూ ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సివుండగా, ఇందుకు మరింత గడువును కోరుతూ సుప్రీంకోర్టులో ఒక మోడిఫికేషన్‌ పిటిషన్‌ వేసింది. అయితే గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పుప్రకారం ఈ ఏడాది జనవరి 24కల్లా టెలికాం కంపెనీలు వాటి ఏజీఆర్‌ బకాయిల్ని చెల్లించలేదు. ఆ తేదీనాటికి చెల్లింపులు చేయని కంపెనీలపై ఎటువంటి చర్యలూ చేపట్టరాదంటూ వివిధ టెలికాం సర్కిళ్లకు టెలికాం శాఖ జనవరిలో ఒక సర్క్యులర్‌ జారీచేసింది. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు గత శుక్రవారం తీవ్ర అగ్రహాన్ని వ్యక్తంచేస్తూ అటు టెలికాం కంపెనీలు, ఇటు టెలికాం శాఖ అధికారులపై కోర్టు ధిక్కార నేరాన్ని మోపుతామంటూ హెచ్చరించింది. చెల్లింపు గడువును కోరుతూ దాఖలైన పిటీషన్‌పై మార్చి 17న జరిగే తదుపరి విచారణకు టెలికాం కంపెనీల ఎండీలు, డైరెక్టర్లు, టెలికాం శాఖ అధికారులు హాజరుకాకావాలంటూ సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ లోపు ఏజీఆర్‌ బకాయిల్లో అధిక మొత్తాన్ని చెల్లించాలంటూ హుకుం జారీచేసింది. మరోవైపు గత శక్రవారంనాడే టెలికాం శాఖ...జనవరిలో జారీచేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటూ ఆదేరోజు అర్థరాత్రిలోగా ఏజీఆర్‌ బకాయిల్ని చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యల్ని తీసుకుంటామంటూ టెలికాం కంపెనీలకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్ని అందుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ధృవీకరించింది. అక్టోబర్‌ 24నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవిన్యూ (ఏజీఆర్‌) బకాయిల కింద టెలికాం శాఖకు ఎంత మొత్తం చెల్లించగలమో ప్రస్తుతం గణిస్తున్నామని, ఆ మొత్తాన్ని వచ్చే కొద్దిరోజుల్లో చెల్లించనున్నట్లు వొడాఫోన్‌ఐడియా శనివారం తెలిపింది. 
జాప్యం చేస్తే జరిమానా
ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై తాము శుక్రవారం టెలికాం కంపెనీలకు నోటీసులు జారీచేశామని, శనివారం పలు కార్యలయాలకు సెలవు అయినందున, సోమవారం సాయంత్రం వరకూ చూసి, చెల్లింపులు చేయని కంపెనీలపై చట్టపరమైన చర్యల్ని తీసుకుంటామంటూ టెలికాం శాఖ అధికారి ఒకరు తాజాగా హెచ్చరించారు. సోమవారం సాయంత్రం లోపు చెల్లింపులు జరపని కంపెనీలకు లైసెన్సు నిబంధనల ప్రకారం జరిమానాలు విధింపు,  ఇతర చట్టపరమైన చర్యలతో కూడిన నోటీసులు జారీచేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా, తాము చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 10,000 కోట్లు తక్షణం చెల్లించివేస్తామని, వివిధ సర్కిళ్లలో తమ ఆదాయాన్ని గణించిన తర్వాత మార్చి 17లోగా మిగిలిన బకాయిల్ని చెల్లించనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ దాదాపు రూ.35,500 కోట్ల ఏజీఆర్‌ బకాయిల్ని చెల్లించాల్సివుంది. 
 You may be interested

ఈ రంగాలకు ‘వైరస్‌’ ఇబ్బందేమీ లేదు: 

Sunday 16th February 2020

ఫలితాల సీజన్‌ ముగిసిందని, మార్కెట్లు ఇకపై కరోనా వైరస్‌ ప్రభావంపై దృష్టి సారిస్తాయని సార్థి గ్రూపు సీఐవో కుంజ్‌ భన్సాల్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం పడని ఏడు రంగాల గురించి ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.   మార్కెట్లపై.. జనవరి మధ్యలో నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టాలకు వెళ్లింది. అప్పటి నుంచి నెల పాటు మార్కెట్‌ ఓ శ్రేణికే పరిమితమైంది. ఈ మధ్యలో బడ్జెట్‌, ఫలితాల సీజన్‌ను మార్కెట్లు సర్దుబాటు

2 వారాలకు రెండు సిఫార్సులు

Saturday 15th February 2020

 ఈ వారంలో ఫిబ్రవరి 10న నిఫ్టీ ఇండెక్స్‌ డౌన్‌సైడ్‌ ట్రెండ్‌లో 12వేల స్థాయిని పరీక్షించింది. బుధవారం సెషన్‌లో మరింత అమ్మకాల ఒత్తిడిని చూసింది. ఐనప్పటికీ.., నిఫ్టీ ఇండెక్స్‌ ఈ వారంలో 0.63శాతం పెరగ్గా, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మాత్రం 0.09శాతం నష్టాన్ని చవిచూసింది. . ఈ నేపథ్యంలో  ఇండియానివేశ్‌ సెక్యూరీటీస్ సీనియర్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు మోహుల్‌ కొఠారి సిఫార్సు రాబోయే 2-3 వారాలకు కింది సిఫార్సులను సూచిస్తున్నారు.  షేరు పేరు: ఓఎన్‌జీసీ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌: రూ.116  స్టాప్‌లాస్‌: రూ.98 అప్‌సైడ్‌:

Most from this category