News


మీ ఫోన్‌ బిల్లు ఎంత పెరుగుతుందో తెలుసా?

Thursday 21st November 2019
news_main1574311275.png-29751

రాబోయే రోజుల్లో వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు టారిఫ్‌ల పెంపుదలో జియో చూపే బాటలో నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో 15 శాతం మేర టారిఫ్‌లు పెంచితే ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ కనీసం 30 శాతం వరకు టారిఫ్‌లు పెంచుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో జియో 15శాతం మేర టారిఫ్‌లు పెంచింది, ఈ దఫా కూడా అంతమేర పెరుగుదల ఉండొచ్చని నిపుణుల అంచనా. రుణభారాలతో కుంగిపోతున్న టెలికం కంపెనీలకు ఈ పెంపుదల సంజీవిని లాంటిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పోటీ కంపెనీలతో టారిఫ్‌ల విషయంలో చాలా వ్యత్యాసం చూపుతూ దూసుకుపోతున్న జియో కొత్తగా టారిఫ్‌లు పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. డేటా వినియోగం, డిజిటల్‌ మార్పును దెబ్బతీయని రీతిలో, నియంత్రణా సంస్థ అనుమతిస్తే టారిఫ్‌లు పెంచుతామని జియో ఇటీవల ప్రకటించింది. వీఐఎల్‌, ఎయిర్‌టెల్‌ అంతకుముందే టారిఫ్‌ల పెంపు ప్రకటన చేశాయి.

ఈ నేపథ్యంలో జియో గతంలోలాగా 15 శాతం పెంచితే మిగిలిన రెండు కంపెనీలకు 30 శాతం వరకు పెంచుకునే వీలుంటుందని క్రెడిట్‌ సూసీ పేర్కొంది.  ట్రాయ్‌ తీసుకునే నిర్ణయం చాలా కీలకమని జెఫర్రీస్‌ పేర్కొంది. కనీసం 20 శాతం మేర పెరుగుదల ఉంటేనే ఆదాయాల్లో గణనీయమైన ప్రభావం ఉంటుందని తెలిపింది. కేవలం టారిఫ్‌లు పెంచితే చాలదని, ఇతర ఊరట చర్యలు ప్రభుత్వం ప్రకటించాలని, అప్పుడే టెలికం కోలుకుంటుందని తెలిపింది. ధరలు పెంచాలన్న జియో నిర్ణయం టెలికం రంగానికి మేలి మలుపని సిటి రిసెర్చ్‌ పేర్కొంది. ప్రైసింగ్‌ రికవరీకి ఇది ఆరంభమని తెలిపింది. ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ ప్రకటన తర్వాత జియో సైతం రేట్ల పెంపుదలకు సై అనడం టెలికం రంగంలో స్వీయ మరమత్తులు శీఘ్రంగా జరుగుతున్నాయనేందుకు నిదర్శనమని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. మూడు కంపెనీలు ధరలు పెంచాలని నిర్ణయించుకోవడం అతిపెద్ద పాజిటివ్‌ చర్యగా పేర్కొంది. ప్రభుత్వం సరైన ఉపశమనాలిస్తే ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ కంపెనీల పరిస్థితి బాగా మెరుగైతుందని తెలిపింది. ఏజీఆర్‌ బకాయిల రద్దు కీలకమని తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏజీఆర్‌ బకాయిల తక్షణ రద్దు ప్రతిపాదనేదీ లేదని బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది. 



You may be interested

పాక్‌లో కేజీ టమోటా@ రూ. 400

Thursday 21st November 2019

పాకిస్తాన్‌ పెద్ద నగరమైన కరాచిలో టమోటా ధరలు బుధవారం ఆకాశాన్ని తాకాయి. కేజీ టమోటా ధర రూ. 400 కు చేరుకుంది. వర్షాలు అధికంగా కురవడంతో టమోటా దిగుబడి తగ్గిందని, అంతే కాకుండా ప్రభుత్వం దిగుమతులపై నియంత్రణలు విధించడంతో డిమాండ్‌కి తగ్గ సరఫరా జరగడం లేదని డాన్‌ న్యూస్‌ పేర్కొంది. గత వారం పాకిస్తాన్‌ ప్రభుత్వం, ఇరాన్‌ నుంచి 4,500 టన్నుల టమోటాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం

వొడా-ఐడియా 10% క్రాష్‌, నష్టాల్లో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు!

Thursday 21st November 2019

టెలికాం కంపెనీలు చెల్లించవలసిన ఏజీఆర్‌(ఎడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ) బకాయిలను మాఫీ చేయడం లేదా ఈ బకాయిలు చెల్లించడానికి టెలికాం కంపెనీలకు కొంత సమయం ఇవ్వడం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం పార్లమెంట్‌లో తెలిపారు. కాగా గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉపశమన ప్యాకేజిని ప్రకటిస్తుందనే వార్తలు మార్కెట్‌ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్లలో

Most from this category