News


కేసీపీ గ్రూపు అధినేత వీఎల్‌ దత్‌ కన్నుమూత

Wednesday 19th February 2020
news_main1582082405.png-31913

కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీఎల్‌ దత్‌ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌, కుమార్తె కవితా దత్‌ ఉన్నారు. 1937 డిసెంబర్‌ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్‌ (వీఎల్‌దత్‌) లండన్‌లోని బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్‌, చక్కెర తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీఎల్‌ దత్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.
ఫిక్కీ సంతాపం...
వీఎల్‌ దత్‌ 1991-92 వరకు ఫిక్కీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ‘‘డాక్టర్‌ వీఎల్‌ దత్‌ అకాల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. పరిశ్రమలకు, దేశానికి ఆయన అందించిన సేవలను ఫిక్కీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్యా, పరిశ్రమల రంగంలో దత్‌ సేవలకు గుర్తింపుగా నాగార్జున యూనివర్సిటీ ఆయనకు లోగడ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని ప్రదానం చేసింది. 



You may be interested

బీఎస్‌ఎన్‌లో వెహికల్‌ ఛార్జీంగ్‌ స్టేషన్లు

Wednesday 19th February 2020

1,000 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఒప్పందం న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌), బీఎస్‌ఎన్‌ఎల్‌ చేతులు కలిపాయి. దశలావారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్‌ఎన్ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్ల నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్‌ సర్వీసులకు అవసరమైన ఇన్‌ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్‌ఎల్‌ ఇన్వెస్ట్ చేయనుంది.

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?..నిఫ్టీ అవరోధాలు 12046, 12,100

Wednesday 19th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 56 పాయింట్లు ప్లస్‌  మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30 ప్రాంతం‍లో 69 పాయింట్లు పుంజుకుని 12,075 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,006 పాయింట్ల  వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో

Most from this category