News


రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెడతాం

Wednesday 21st August 2019
news_main1566364672.png-27912

  • గ్రేటర్‌ నోయిడాలో మరో ప్లాంట్‌ 
  • వెల్లడించిన వివో ఇండియా 

జైపూర్‌: చైనా మొబైల్‌ కంపెనీ వివో భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఇప్పటిదాకా భారత్‌లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివో ఇండియా డైరెక్టర్‌(బ్రాండ్‌ స్ట్రాటజీ) నిపుణ్‌ మర్య తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న తమ ప్లాంట్‌ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో ఏడాదికి 2.5 కోట్ల మొబైల్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తోందని వివరించారు. తమ ఫోన్ల కోసం డిమాండ్‌ పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడం కోసం​రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. దశలవారీగా ఈ పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. గ్రేటర్‌ నోయిడాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే, ఏడాదికి 5 కోట్ల ఫోన్లను ఉత్పత్తి చేస్తామని వివరించారు. 
21 శాతం మార్కెట్‌ వాటా...
భారత మొబైల్‌ మార్కెట్లో తమ వాటా 21.2 శాతమని, ఆఫ్‌లైన్‌ మార్కెట్లో రెండో అతి పెద్ద మొబైల్‌ కంపెనీ తమదేనని నిపుణ్‌ వివరించారు. భారత మార్కెట్‌ కోసం రెండు కొత్త మొబైల్‌ ఫోన్లను అందించనున్నామని తెలిపారు. ఇటీవలనే కొత్తగా ఎస్‌ సిరీస్‌లో వివో ఎస్‌1 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీని ధర రూ.17,999 అని వివరించారు. 



You may be interested

ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

Wednesday 21st August 2019

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసులో చుక్కెదురు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్ సెల్స్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ఫ్రాడ్‌ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది

క్లాసిక్‌ పోలో మరో 65 ఔట్‌లెట్లు

Wednesday 21st August 2019

గ్రూప్‌ టర్నోవర్‌ రూ.1,000 కోట్లు అంచనా నూతన కలెక్షన్‌ను ఆవిష్కరించిన కంపెనీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెడీమేడ్స్‌ తయారీలో ఉన్న రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ ‘క్లాసిక్‌ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్‌ ఔట్‌లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్‌లో రానున్నాయని క్లాసిక్‌ పోలో రిటైల్‌ డైరెక్టర్‌ రమేశ్‌ వి ఖేని

Most from this category