News


భారీగా పెరుగుతున్న కార్డుల వినియోగం: వీసా

Saturday 1st June 2019
Markets_main1559366400.png-26036

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నదానికి నిదర్శనంగా... భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్యలో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ అయినవేనని తెలిపింది. డెబిట్‌ కార్డుల వినియోగ పరిస్థితుల్లో మార్పులపై వీసా గ్రూపు భారత మేనేజర్‌ టీఆర్‌ రామచంద్రన్‌ మాట్లాడుతూ... ‘‘డిజిటల్‌ దేశంగా మారుతున్న భారత్‌లో డెబిట్‌ కార్డులు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. గత 12 నెలల్లో డెబిట్‌ కార్డు లావాదేవీలు 23 శాతం పెరిగాయి. ప్రజలు తమ కార్డులను తరచుగా వినియోగిస్తుండడం ఉత్సాహాన్చిచ్చే సంకేతం. మరింత భద్రతతో కూడిన చెల్లింపుల అనుభవం దిశగా పనిచేసేందుకు మాకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు. You may be interested

పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 1st June 2019

419.99 బిలియన్‌ డాలర్లకు చేరిక ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) మరోసారి పెరుగుదలను నమోదుచేశాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది మే 24తో ముగిసిన వారంలో 1.99 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 419.99 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. అంతకుముందు వారంలో 2.05 బిలియన్‌ డాలర్లు తగ్గి 417.99 బిలియన్లుగా నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల

డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

Saturday 1st June 2019

న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్ ఎన్‌రైట్ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు. గోప్యత

Most from this category