News


అమెరికాలో కేసు.. కోర్టు బయట పరిష్కారం

Thursday 19th December 2019
news_main1576727782.png-30296

  • రూ. 5.6 కోట్లు చెల్లించనున్న ఇన్ఫోసిస్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగులను తప్పుగా వర్గీకరించి చూపడం, పన్నుపరమైన మోసాలకు పాల్పడటం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసును ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కోర్టు వెలుపల పరిష్కరించుకోనుంది. ఇందుకు సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రానికి 8,00,000 డాలర్లు (సుమారు రూ.5.6 కోట్లు) చెల్లించనుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ జేవియర్‌ బెసెరా ఈ విషయాలు తెలిపారు. ‘తక్కువ జీతాలతో పనిచేయించుకునేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు ఇన్ఫోసిస్‌ తప్పుడు వీసాలపై ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చింది. కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవనడానికి ఈ సెటిల్మెంట్‌ ఒక నిదర్శనం’ అని పేర్కొన్నారు.

2006–2017 మధ్య కాలంలో అమెరికాలో 500 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్‌ హెచ్‌–1బీ వీసాలపై కాకుండా బీ–1 వీసాలపై పనిచేయించుకుందన్న ప్రజా వేగు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇలాంటి తప్పుడు వర్గీకరణ వల్ల ఇన్ఫోసిస్‌.. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరుద్యోగ బీమా, వైకల్య బీమా, ఉద్యోగుల శిక్షణ పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని ఆరోపణలున్నాయి. సాధారణంగా హెచ్‌–1బీ వీసాలపై పనిచేసే సిబ్బందికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, తమపై ఆరోపణలను ఇన్ఫోసిస్‌ తోసిపుచ్చింది. సుదీర్ఘంగా 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి  ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే పరిష్కరించుకుంటున్నట్లు వివరణనిచ్చింది. తప్పుడు పత్రాలు సమర్పించిందన్న ఆరోపణలను సెటిల్‌ చేసుకునేందుకు 2017లో న్యూయార్క్‌కు ఇన్ఫోసిస్‌ 1 మిలియన్‌ డాలర్లు చెల్లించింది. 



You may be interested

ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!

Thursday 19th December 2019

సైబర్‌ నేరాల కట్టడిపై బీవోఐ చైర్మన్‌ పద్మనాభన్‌ వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జి.పద్మనాభన్‌ అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్‌ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Thursday 19th December 2019

ప్రపంచ ప్రతికూల సంకేతాల ఫలితంగా గురువారం స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 41,535 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,210 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category