STOCKS

News


ఏపీలో వికా గ్రూపు భారీ విస్తరణ

Friday 27th September 2019
news_main1569558109.png-28579

  • 11 మిలియన్‌ టన్నులకు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం
  • కడప భారతీ సిమెంట్లో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్
  • ఏపీలో ప్రభుత్వ గృహ నిర్మాణంతో సిమెంటుకు డిమాండ్‌
  • కేంద్రం కార్పొరేట్ టాక్స్ తగ్గించడంతో కంపెనీల పెట్టుబడులు
  • ‘సాక్షి’తో వికా గ్రూపు చైర్మన్ గై సిడోస్

సాక్షి, అమరావతి: ఫ్రెంచ్‌ సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికా ఇండియాలో భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కేంద్రం భారీగా తగ్గించడంతో రానున్న రోజుల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు వికా గ్రూపు చైర్మన్‌ గై సిడోస్‌ వెల్లడించారు. ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందంతో రెండు రోజులు పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సిడోస్‌... దేశవ్యాప్తంగా సిమెంట్‌ పరిశ్రమ పరిస్థితులు, విస్తరణ ప్రణాళికలను ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ఆ వివరాలు...

ప్రశ్న: కొన్ని నెలలుగా దేశీయ సిమెంట్‌ పరిశ్రమ తిరోగమన దశలో ఉంది. మున్ముందు పుంజుకునే అవకాశాలున్నాయా?
వృద్ధిరేటు మందగమనంతో కొంత కాలంగా సిమెంట్‌ పరిశ్రమ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశీ సిమెంట్‌ పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే. ప్రభుత్వం ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు, రహదారులు, గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. కాబట్టి మున్ముందు సిమెంట్‌కు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే 25 లక్షల గృహాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.

ప్రశ్న: కేంద్రం ఒక్కసారిగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 10 శాతం తగ్గించడాన్ని ఎలా చూస్తున్నారు?
ఇది వృద్ధిరేటును పెంచే సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పటి వరకు ఇండియాలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండేది. దీన్ని కేంద్రం ఒక్కసారిగా భారీగా తగ్గించడమే కాకుండా ఇతర దేశాల కంటే కనిష్ట స్థాయికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కంపెనీలకు అదనపు నిధులు వస్తాయి. దీంతో కంపెనీల విస్తరణ సామర్థ్యాలు పెరుగుతాయి. 

ప్రశ్న: కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గిన నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలేమైనా ఉన్నాయా?
దేశంలో సిమెంట్‌కు డిమాండున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థా్‌‍్యన్ని పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం కడపలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన భారతీ సిమెంట్‌, కర్నాటక జిల్లా కల్బుర్గిలో మరో యూనిట్‌ ఉన్నాయి. ఈ రెండు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 8 మిలియన్‌ టన్నులు. దీన్ని రానున్న సంవత్సరాల్లో 11 మిలియన్‌ టన్నులకు పెంచాలని లక్ష్యించుకున్నాం. 

ప్రశ్న: ఏపీలో కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుటున్నాం. కాకపోతే వీటి గురించి ఇప్పుడే వివరించలేం. పునురుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెడుతున్నాం. ఇందులో భాగంగా కడప భారతీ యూనిట్‌లో సొంత అవసరాల కోసం 10 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం.

ప్రశ్న: ఈ రెండు రోజులూ మీ పర్యటన ఎలా సాగింది?
ఫ్రాన్స్‌కు చెందిన పరిశ్రమలు, వాణిజ్య ప్రతినిధుల సమాఖ్య (మెడెఫ్‌) సభ్యులతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్న రంగాలను పరిశీలించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులకు సహకారమందిస్తామని చెబుతోంది. ముఖ్యంగా అర్బన్‌ ఇన్‌ఫ్రా, పోర్టులు, ఎనర్జీ, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో అనేక అవకాశాలున్నాయి. ఈ పర్యటన ఫలితాలు రానున్న కొద్ది నెలల్లోనే ఏపీ చూస్తుంది. 



You may be interested

లాభనష్టాల మధ్య ఊగిసలాట

Friday 27th September 2019

అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభపు రోజైన శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో స్టాక్‌ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,850 పాయింట్లకు అటూఇటూ హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,550 పాయింట్ల స్థాయికి ఇరువైపులా 35 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడుతోంది.

వన్‌ప్లస్‌ 55-అంగుళాల ఆండ్రాయిడ్‌ టీవీ విడుదల

Friday 27th September 2019

ప్రారంభ ధర రూ. 69,900 న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్‌ డాట్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 - రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్‌ఆర్‌డీ 10ప్లస్‌ సపోర్ట్‌, 50వాట్స్‌ ఎనిమిది-స్పీకర్ల సెటప్, సినిమాటిక్ సౌండ్

Most from this category