STOCKS

News


‘కేఫ్ కాఫీ డే’ సిద్ధార్థ మిస్సింగ్‌

Tuesday 30th July 2019
news_main1564459135.png-27392

ప్రసిద్ధ కాఫీ పార్లర్‌​ చైన్‌ కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ ఆచూకీ నిన్న రాత్రి నుంచి తెలియడం లేదు. గత రాత్రి మంగళూరు సమీపం‍లోని నేత్రావతి నది వద్ద ఉన్న వంతెన దగ్గర సిద్ధార్థ దిగాడని కారు డ్రైవర్‌ వివరించాడు. కారు దిగే సమయంలో సిద్ధార్థ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నడని, కారు దిగిన గంట సేపయినప్పటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి అప్రమత్తం చేశానని డ్రైవర్‌ తెలిపాడు. పోలీసులు ఆయన కోసం అన్వేషించడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ కోసం హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డులను పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణ కన్నడ పోలీసులు నేత్రావతి నది సమీపంలో వెతుకుతున్నారు.  ఈ సెర్చ్ ఆపరేషన్‌ కోసం బోట్ సర్వీస్, స్థానిక మత్స్యకారుల సహాయం ఉపయోగిస్తున్నట్లు మంగళూరు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
  సిద్ధార్థ నిన్న సక్లేష్పూర్ వెళ్తున్నానని చెప్పి బెంగళూరు నుంచి బయలుదేరారని, అయితే దారిలో తన డ్రైవర్‌ను మంగళూరు వెళ్ళమని చెప్పి, నేత్రావతి నది వంతెన వద్దకు చేరుకున్నాక కారులోంచి దిగి, తన డ్రైవర్‌ను ముందుకు వెళ్లి ఆపమని కోరాడని పాటిల్ వివరించారు. సిద్ధార్థ చివరిగా ఎవరితో మాట్లాడాడో పోలీసులు తనిఖీ చేస్తున్నారని ఆయన తెలిపారు. సిద్ధార్థ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడనే విషయం తెలిసిందే.
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప, కాంగ్రెస్ నాయకులు డికె శివకుమార్, బిఎల్ శంకర్ లు ఎస్ఎం కృష్ణ నివాసాలను తెల్లవారుజామున సందర్శించినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. ఎస్.ఎం.కృష్ణతో సహా బెంగళూరులోని సిద్ధార్థ కుటుంబ సభ్యులతో మాట్లాడానని పాటిల్ తెలిపారు.
  మార్చి 2019 నాటికి, కేఫ్ కాఫీ డే భారతదేశం అంతటా 1,752 అవుట్‌లెట్లను కలిగి ఉంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్  ఆర్థిక సంవత్సరంలో 2018లో రూ. 1,777 కోట్లు, ఆర్థిక సంవత్సరం 2019లో రూ. 1,814 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 2020 నాటికి రూ .2,250 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని  పెట్టుకున్నారు. ఇటీవల మైండ్‌ట్రీలోని  వీజీ సిద్ధార్థ వాటా 20.3 శాతాన్ని ఎల్‌అండ్‌టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

నోట్‌:అదృశ్యం కాకముందు సిద్ధార్థ విడిచిపెట్టిన ఉత్తరంYou may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- యజమాని వీజీ సిద్ధార్థ నిన్న సాయంత్రం(జూలై 19న) నుంచి అదృశ్యమయ్యారు. అతని ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుంది. జీ లిమిటెడ్‌:- కంపెనీలో సుభాష్‌ చంద్ర వాటా కొనుగోలుకు అమెరికా ఆధారిత కేబుల్‌ కంపెనీ లుపా సిస్టమ్స్‌ బైండింగ్‌ ఆఫర్‌ నుంచి బైండింగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌:- రైకా కమర్షియల్ వెంచర్స్ కంపెనీ ఓపెన్‌ మార్కెట్‌ ఆఫర్‌ పద్ధతిలో

లాభాల ప్రారంభం

Tuesday 30th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం పాలసీ నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింంట్ల లాభంతో 37,735 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,215 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, టాటా స్టీల్‌లు స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Most from this category