News


ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు

Friday 7th February 2020
news_main1581044943.png-31581

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. "కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్‌ వన్‌ కాగలమని నాకు అనిపించింది" అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్‌టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. 

'శాంత్రోవాలా'.. షారుఖ్‌..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. 
 



You may be interested

సన్‌ ఫార్మా లాభం 26 శాతం డౌన్‌

Friday 7th February 2020

పెరిగిన నికర వ్యయాల ప్రభావం ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్యాస్యూటికల్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 26 శాతం తగ్గింది.  గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని

11 శాతం తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

Friday 7th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.2 శాతం తగ్గి రూ.1,394 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.3,786 కోట్ల నుంచి రూ.3,136 కోట్లకు వచ్చి చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.5.29 మధ్యంతర డివిడెండు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. 

Most from this category