News


బీఎస్‌ఎన్‌లో వెహికల్‌ ఛార్జీంగ్‌ స్టేషన్లు

Wednesday 19th February 2020
news_main1582082637.png-31914

1,000 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఒప్పందం

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌), బీఎస్‌ఎన్‌ఎల్‌ చేతులు కలిపాయి. దశలావారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్‌ఎన్ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్ల నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్‌ సర్వీసులకు అవసరమైన ఇన్‌ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్‌ఎల్‌ ఇన్వెస్ట్ చేయనుంది. స్థలం, విద్యుత్ కనెక్షన్లను .. బీఎస్‌ఎన్‌ఎల్‌ సమకూరుస్తుంది. చార్జింగ్ సేవలను చౌకగా అందించేందుకు ఇది తోడ్పడగలదని ఈఈఎస్‌ఎల్ తెలిపింది. జాతీయ విద్యుత్ వాహన పథకంలో భాగంగా ఈఈఎస్‌ఎల్ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 300 ఏసీ, 170 డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. You may be interested

రూ.3499లకే అంతర్జాతీయ విమాన టికెట్‌

Wednesday 19th February 2020

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 3,499కే విదేశీ రూట్లలో విమాన టికెట్ అందిస్తోంది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ అంతర్జాతీయ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (18న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 21తో ముగియనుంది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే

కేసీపీ గ్రూపు అధినేత వీఎల్‌ దత్‌ కన్నుమూత

Wednesday 19th February 2020

కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీఎల్‌ దత్‌ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌, కుమార్తె కవితా దత్‌ ఉన్నారు. 1937 డిసెంబర్‌ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్‌ (వీఎల్‌దత్‌) లండన్‌లోని బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్‌, చక్కెర తదితర రంగాల్లో

Most from this category