News


బీపీసీఎల్‌ కొనేందుకు తప్పక పోటీపడతాం!

Saturday 21st December 2019
news_main1576912624.png-30352

వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌
భారత పెట్రోలియ కార్పొరేషన్‌ కొనుగోలుకు తప్పక పోటీపడతామని, బీపీసీఎల్‌ ఆఫర్‌కు తప్పక బిడ్‌ వేస్తామని వేదాంత రిసోర్సెస్‌ చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో 53.29 శాతం వాటా విక్రయానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ‘‘బిడ్స్‌పై పరిశీలిన జరుపుతున్నాం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిలో మాకు 30 శాతం వాటా ఉంది, ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలుగా ఉన్నాం. అందువల్ల ఈ ఆఫర్‌పై చాలా ఆసక్తిగా ఉన్నాం. తప్పక బీపీసీఎల్‌ బిడ్‌లో పాల్గొంటాం.’’అని అగర్వాల్‌ చెప్పారు. సీఏఏ పై వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వం ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంతటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదని, ఇవి చాలా ముఖ్యమైనవని కొనియాడారు. ప్రపంచంలో టాప్‌ 3 నాయకుల్లో మోదీ ఒకరి ప్రశంసించారు. ఆయన విశ్వసనీయత అమోఘమన్నారు. అసోచాం వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. చైనా, అమెరికాల్లో ఒక ప్రాజెక్టు ఆరంభిస్తే అది పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ కూడా అలాంటి విధానం రావాలని అనిల్‌ అభిప్రాయపడ్డారు. ఇండియాలో పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాల మధ్య తీవ్రమైన వివక్ష ఉందన్నారు. అన్ని రంగాలు ఒకేలా పనిచేసే వ్యవస్థను తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వాలకు వ్యాపారలతో సంబంధం లేకుండా ఉండాలన్నారు. 



You may be interested

12పాయింట్ల నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం స్వల్పంగా నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12290)తో పోలిస్తే 12 పాయింట్లు నష్టపోయి 12,278 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ స్వల్పంగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిన్నటి రోజుల ఉదయం సెషన్‌లో సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా

ట్రేడ్‌డీల్‌పై సంతకాలకు రెడీ!

Saturday 21st December 2019

వాణిజ్యయుద్ధానికి ముగింపు పలుకుతూ తయారైన ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూఎస్‌, చైనా తయారవుతున్నాయి. ఈమేరకు చైనా అధ్యక్షుడితో చర్చల అనంతరం అమెరికా అధ‍్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేశారు. ‘‘ట్రేడ్‌డీల్‌పై చైనా ప్రెసిడెంట్‌తో మంచి చర్చలు జరిగాయి. ఇ‍్పపటికే పలు అగ్రిఉత్పత్తులను భారీగా కొనేందుకు చైనా అంగీకరించింది. త్వరలో డీల్‌పై సంతకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’అని ట్రంప్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. హాంకాంగ్‌, నార్త్‌కొరియాపై సైతం తామిరువురం చర్చించామన్నారు.

Most from this category