News


వేదాంత లాభం 49 శాతం అప్‌

Saturday 1st February 2020
news_main1580533334.png-31390

న్యూఢిల్లీ: వేదాంత కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 49 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,574 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.2,348 కోట్లకు పెరిగిందని వేదాంత కంపెనీ సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ వెల్లడించారు. ఆదాయం మాత్రం రూ.25,067 కోట్ల నుంచి రూ.22,007 కోట్లకు తగ్గిందని తెలిపారు. వ్యయాలు కూడా రూ.21,589 కోట్ల నుంచి రూ.18,369 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. 


ఆయిల్‌, గ్యాస్‌ వ్యాపారం అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల ఆదాయం 3 శాతం తగ్గిందని (సీక్వెన్షియల్‌గా) శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి నికర రుణభారం రూ.23,384 కోట్లకు పెరిగిందని,  ఫెర్రో అలాయ్స్‌ కార్పొరేషన్‌ను రూ.280 కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. You may be interested

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,631 కోట్లు

Saturday 1st February 2020

13 శాతం వృద్ధి  4 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,631 కోట్ల​ నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.1,444 కోట్లుతో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

రూ.41,000 దాటిన పసిడి

Saturday 1st February 2020

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చైనాలోనేగాక ఇతర దేశాల్లో కూడా వైరస్‌ కేసులు నమోదవుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులవైపు ఆసక్తి కనబరుస్తుండడంతో బంగారం ధర రూ.41,000పైకి చేరింది. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ.700 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 41,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లు పెరిగి

Most from this category