News


వేదాంత లాభం రూ.2,158 కోట్లు

Friday 15th November 2019
news_main1573787869.png-29598

  • 61 శాతం వృద్ధి 
  • కలసివచ్చిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు 
  • 49 శాతం పెరిగిన ఇతర ఆదాయం

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ.856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. 



You may be interested

నాట్కో వైజాగ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Friday 15th November 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాట్కో ఫార్మా విశాఖపట్నలోని ప్లాంట్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ప్లాంట్‌ సామర్థ్య విస్తరణలో ఇది అత్యంత కీలకమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, ఇతర అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి ఈ ప్లాంట్‌ను విస్తరించామని పేర్కొంది. ఈ ప్లాంట్‌ నుంచి ప్రధానంగా ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్‌లతో పాటూ అంకాలజీ విభాగంలో సైటోటాక్సిక్‌ బ్లాక్స్‌ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. సైట్‌ బదిలీ, రెగ్యులేటరీ ఆడిట్‌ కోసం ఇప్పటికే

వొడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్‌...భారీ నష్టాల్లో రికార్డు

Friday 15th November 2019

- ఐడియాకు రూ.50,921 కోట్ల నష్టాలు  - ఒక భారత కంపెనీకి ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు  - ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.23,045 కోట్లు  - కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు న్యూఢిల్లీ:  ఏజీఆర్‌పై (సర్దుబాటు చేసిన వార్షిక స్థూల రాబడి) సుప్రీం కోర్ట్‌ తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల

Most from this category