News


వేదాంత లాభం రూ.1,351 కోట్లు

Saturday 27th July 2019
news_main1564202195.png-27349

  • 12 శాతం డౌన్‌
  • నిర్వహణ లాభం రూ.5,578 కోట్లు 

న్యూఢిల్లీ: మైనింగ్‌ కంపెనీ, వేదాంత నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ. 1,533 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,351 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. కమోడిటీ ధరలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని వేదాంత సీఈఓ శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.22,624 కోట్ల నుంచి రూ.21,754 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి తమ స్థూల రుణ భారం రూ.59,517 కోట్లని, రూ.30,774 కోట్ల నగదు నిల్వలున్నాయని వివరించారు. నిర్వహణ లాభం రూ.6,702 కోట్ల నుంచి 17 శాతం పతనమై రూ.5,578 కోట్లకు చేరిందని తెలిపింది. 



You may be interested

‘నిస్సాన్‌’ చెన్నై ప్లాంట్‌లో 1,700 ఉద్యోగాలకు కోత..!

Saturday 27th July 2019

మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగంలోనే అధికం న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌.. భారత్‌లోని తన చెన్నై ప్లాంట్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆరు వేలకు మించి ఉద్యోగులను తీసివేయనున్నట్లు కంపెనీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 6,100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. ఆరు ప్రధాన నగరాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు పేర్కొంది. ఈ

వొడాఫోన్‌ ఐడియాకు రూ.4,874 కోట్ల నష్టాలు

Saturday 27th July 2019

ఆదాయం రూ.11,270 కోట్లు న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కన్సాలిడేటెడ్‌ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ రెండూ 2018 ఆగస్ట్‌ 31 నుంచి విలీనమై వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది

Most from this category