News


వేదాంత రూ.60,000 కోట్ల పెట్టుబడి

Tuesday 17th December 2019
news_main1576553417.png-30260

2-3 ఏళ్లలో పెడతామన్న చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌
ముంబై: వేదాంత కంపెనీ రానున్న 2-3 ఏళ్లలో రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. రానున్న 4- 5 ఏళ్లలో 3,000- 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇదే కాలానికి 1,000 కోట్ల డాలర్ల నికర లాభం సాధించడం లక్ష్యమని వివరించారు. ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌ 2019లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 
మరిన్ని ప్రభుత్వ కంపెనీలను కొంటాం....
భారత్‌లో ఇప్పటిదాకా 3,500 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేశానని అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. గత పదేళ్లలో హిందుస్తాన్‌ జింక్‌, బాల్కో, సెస గోవ, కెయిర్న్‌ తదితర మొత్తం 13 కంపెనీలను కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కంపెనీల కార్యకలాపాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం విదేశీయులపై కాకుండా తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలపైనే ఆధారపడాలని ఆయన సూచించారు. విదేశీయులు లాభాపేక్షతోనే వ్యవహరిస్తారని, తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలు మాత్రం దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తారని చెప్పారు. ప్రభుత్వం తమపై ఆధారపడితే విదేశీ పెట్టుబడులు కూడా తేగలమని పేర్కొన్నారు. గ్లాస్‌,  ఆప్టికల్‌ ఫైబర్‌, కేబుల్‌ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని ఈ సందర్భంగా చెప్పారాయన. గత ఆరేళ్లలో వివిధ పన్నుల రూపేణా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు. పది కోట్ల మంది చిన్నారుల, 5 కోట్ల మంది మహిళల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. సంపదలో మూడో వంతు సమాజానికి తిరిగి ఇచ్చేయాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. 



You may be interested

ఐఓసీని అధిగమించిన రిలయన్స్‌

Tuesday 17th December 2019

ఫార్చ్యూన్‌ ఇండియా- 500లో అగ్రస్థానం 2018-19లో రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయం వృద్ధిలో ఐఓసీ కంటే 8.4 శాతం అధికం న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చ్యూన్‌ ఇండియా- 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను  (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018-19 ఆర్థిక

జీఎస్‌టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం

Tuesday 17th December 2019

వసూళ్లు తగ్గినందునే చెల్లింపుల్లో జాప్యం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబై: జీఎస్‌టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తు‍న్న నేపథ్యంలో

Most from this category