News


త్వరలో ఐపీఓకు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

Saturday 21st December 2019
news_main1576922377.png-30357

  • సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ
  • రూ.3వేల కోట్ల సమీకరణకు యోచన

నిధుల సమీకరణలో భాగంగా మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌ యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీవోకు వచ్చేందు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ ప్రాతిపాధిక సంస్థ సెబీకి సమర్పించింది. దేశంలో అతిప్రాచీన, ఏడో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండింగ్‌ హౌస్‌ పేరోందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా 3.9 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ.3వేల కోట్ల సమీకరణకు సిద్ధమైంది. 

ఐపీఓలో భాగంగా ఎస్‌బీఐ, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు ఒక్కోక్కటి 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను , పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టీ రౌ ప్రైస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు 38.04 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి.

ఐపీఓ అనంతరం కంపెనీ విలువ రూ.10వేల కోట్లకు చేరుకుంటుందని యూటీఐ ఏఎంసీ అంచనాల వేస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పాన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లు ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకొని ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి. గురవారం నాటి షేరు ముగింపు ధరతో లెక్కిస్తే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మ్యూచువల్‌ ఫండ్‌ విలువ రూ.66,775 కోట్లుగానూ, నిప్పాన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విలువ రూ.20,678 కోట్లుగా ఉంది. 



You may be interested

వచ్చే వారానికి రెండు స్టాక్స్‌

Saturday 21st December 2019

గత వారంకొంత కన్సాలిడేషన్‌ తదుపరి శుక్రవారం(20)తో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ఇందుకు గత రెండు వారాలలో మెరుగుపడిన సెంటిమెంటు దోహదపడినట్లు మార్కెట్‌ విశ్లేషకులు కునాల్‌ బోత్రా పేర్కొంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్లూచిప్స్‌ ఇందుకు సహకరించినట్లు  తెలియజేశారు. ఈ సందర్భంగా కునాల్‌ బోత్రా వచ్చే వారానికి రెండు స్టాక్స్‌

పిచాయ్‌కు అదిరిపోయే ప్యాకేజీ

Saturday 21st December 2019

వేతనం కాకుండా దాదాపు రూ. 1700 కోట్ల ప్యాకేజీ ఆల్ఫాబెట్‌ కొత్త సీఈఓ సుందర్‌పిచాయ్‌కు బంపర్‌ ప్యాకేజీని కంపెనీ ఆఫర్‌ చేసింది. 2020లో వార్షిక వేతనం 20 లక్షల డాలర్లతో పాటు 24కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,700 కోట్లు) విలువైన స్టాక్‌ ప్యాకేజీని అందించనుంది. ఆల్ఫాబెట్‌ మరియు గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు పెరిగినందున సుందర్‌కు ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు కంపెనీ అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌కు తెలిపింది. ఈ మొత్తం ఆయనకు

Most from this category