News


ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు ప్రారంభించిన యుఎస్‌సెక్‌

Thursday 24th October 2019
news_main1571898658.png-29107

   కంపెనీ లాభాలను, మార్జిన్‌లను ఎక్కువ చేసి చూపించారని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా యుఎస్‌ సెక్యురిటీ, ఎక్సేంజ్‌ బోర్డు(యుఎస్‌ సెక్‌)కు  ఆ కంపెనీ ఉద్యోగుల గ్రూప్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విజిల్‌ బ్లోవర్‌ ఫిర్యాదుపై దర్యాప్తును యుఎస్‌ సెక్‌ ప్రారంభించింది. ఇన్ఫోసిస్‌, యుఎస్‌ సెక్‌ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తుందని, వారికి అందుబాటులో ఉంటుందని కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా పెద్ద ఒప్పందాలకు సంబంధించి కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓ ఫైనాన్స్‌ టీంపై ఒత్తిడి చేసేవారని, లాభాలు, మార్జిన్‌లు పెరిగేవిధంగా అనైతిక పద్ధతులను అనుసరించారని ‘నైతిక ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే గుర్తుతెలియని ఉద్యోగుల గ్రూప్‌ యుఎస్‌ సెక్‌కు, ఇన్ఫోసిస్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
  దేశీయ మార్కెట్‌ నియంత్రణ సంస్థ(సెబీ) కూడా ఈ ఫిర్యాదులపై అదనపు సమాచారాన్ని కంపెనీ నుంచి కోరింది. ‘సెబీ కోరినట్టు ఆరోపణలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని అందించేందుకు ఇన్ఫోసిస్‌ సిద్ధంగా ఉంది. ఈ విషయంపై యుఎస్‌ ఫెడరల్‌ కోర్టులో దాఖలైన క్లాస్‌ యాక్సన్‌ లా సూట్‌కు సంబంధించిన విషయాలను పరిశీలిస్తున్నాం’ అని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా విజిల్‌బ్లోవర్‌  ఫిర్యాదు సెప్టెంబర్‌ 30న కంపెనీ బోర్డు ముందుకొచ్చిందని, అక్టోబర్‌ 10న కంపెనీ ఆడీట్‌ టీంకు దీని గురించి తెలిసిందని, త్రైమాసిక ఫలితాలను ఖరారు చేయడానికి అక్టోబర్‌ 11న సమావేశమయిన నాన్‌ ఎక్సిక్యూటివ్‌ బోర్డు ఈ ఫిర్యాదుపై చర్చించారని నందన్‌నిలేకని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.



You may be interested

లాభాల్లో నుంచి నష్టాల్లోకి మార్కెట్‌

Thursday 24th October 2019

లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ కల్లా నష్టాల్లోకి మళ్లింది. మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే మహారాష్ట్రలో భాజపా గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే హరియాణా ఫలితాలు మాత్రం హంగ్‌ దిశగా కదులుతున్నాయి. హరియాణ సీఎం పీఠాన్ని చిన్న పార్టీ జేజేపీకి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్‌ ఆఫర్‌ చేసింది. ఈ అనిశ్చితి సమయంలో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా

గరిష్టం నుంచి 1శాతం పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 24th October 2019

గరిష్ట స్థాయి నుంచి 1శాతం పతనమైన ఇండెక్స్‌  ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల్లోకి నుంచి నష్టాల్లోకి మళ్లింది. ఈ వారంలో ఇప్పటికి వరకు రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన బ్యాంకింగ్‌ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు ఈ ఇండెక్స్‌ కిత్రం ముగింపు(29459.60)తో పోలిస్తే అరశాతం లాభం(145 పాయింట్లు)తో 29604.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో

Most from this category