STOCKS

News


ఫార్మా వృద్ధిపై యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రభావం

Tuesday 19th November 2019
news_main1574133848.png-29686

తనిఖీల వల్లే ప్రస్తుత పరిస్థితి
డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ ప్రసాద్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్‌ఎఫ్‌డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ అన్నారు. సీఐఐ-ఐఎంటీహెచ్‌ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్‌, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్‌ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆగిపోయింది. వీటి నుంచి బయటపడాలంటే యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇక్కడి కంపెనీలు నాణ్యత, వ్యవస్థ, క్రమశిక్షణ, సమాచార సమగ్రత పాటించాల్సిందే. ఇంకా పాత ప్లాంట్లను కొనసాగిస్తున్న కంపెనీలూ ఉన్నాయి. యాంత్రికీకరణ జరగాలి’ అని వివరించారు. 
కొత్త అవకాశాలు ఉన్నా..
యూఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో భారత ఔషధ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌, కెమికల్‌ ఇంటర్మీడియరీస్‌ సరఫరాలో అంతర్జాతీయంగా చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. వీటిని భారత్‌తోపాటు ప్రపంచదేశాలు చైనా నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ముడి సరుకును చైనా సరఫరా చేస్తోందన్నారు. ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో పశ్చిమ దేశాలు చైనాపై ఆధారపడడం తగ్గించాలని భావిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఇప్పుడు చైనా నూతన ఆవిష్కరణలవైపు దృష్టిసారిస్తోంది. చవక ముడిపదార్థాల సరఫరాదారు అన్న ముద్ర నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ అంశమే భారత్‌కు నూతన వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. చైనా ఒక్కటే భారత్‌కు అతి పెద్ద మార్కెట్‌. భారత కంపెనీలు ముడిపదార్థాల తయారీ పెంచాలి. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేయాలి’ అని వెల్లడించారు.
డిజిటల్‌ మార్కెటింగ్‌..
ఫార్మా కంపెనీలు డిజిటల్‌ మార్కెటింగ్‌ విషయంలో ఇంకా వెనుకంజలో ఉన్నాయని ప్రసాద్‌ తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌తో ఔషధాలను మార్కెట్‌ చేస్తున్నాయని అన్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ పెరిగితే మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ ఉద్యోగాలు తగ్గుతాయని చెప్పారు. అయితే కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. కాగా, ఐఎంటీ రూపొందించిన హెల్త్‌, ఫార్మా రిపోర్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 You may be interested

బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం

Tuesday 19th November 2019

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది. మరోవైపు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు

సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట

Tuesday 19th November 2019

- సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసు విషయంలో  సెప్టెంబర్‌ 9న శాట్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజా

Most from this category