News


దేశీయ పరిశ్రమపైనా...అమెరికా సుంకాల ప్రభావం

Monday 17th September 2018
news_main1537158995.png-20306

న్యూఢిల్లీ: అల్యూమినియం, స్టీల్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది. స్టీల్‌ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం మేర పన్నును ఈ ఏడాది మే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే, కచ్చితంగా ఎంత మేర ప్రభావం పడుతుందన్న అంచనా వేయడం కష్టమని, భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో ఖరీదుగా మారి, పన్ను మినహాయింపు కలిగిన ఇతర దేశాల ఉత్పత్తులకు పోటీనివ్వలేని పరిస్థితి ఉంటుందని అసోచామ్‌ ‘ప్రపంచ వాణిజ్య యుద్ధం, ప్రభావాలు, సవాళ్ల’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జింక్‌, నికెల్‌ లోహాల ధరలపైనా ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషించింది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్‌ దిగుమతి దేశం. గతేడాది 35.6 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను దిగుమతి చేసుకుంది. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాల విధింపు, ఆ తర్వాత చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లతో అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటిపై టారిఫ్‌లను విధించుకుంటూనే ఉన్నాయని అసోచామ్‌ నివేదిక పేర్కొంది. ఇది తీవ్రతరం అయితే అంతర్జాతీయ వృద్ధికి విఘాతం కలగడంతోపాటు, భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యలను తెచ్చిపెడుతుందని తెలియజేసింది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జీనియన్‌ కలర్స్‌లో అదనంగా 3.10శాతం వాటాను రూ.8.39 కోట్లకు కొనుగోలు చేసింది. ఈవాటా కొనుగోలుతో జీనియన్‌ కలర్స్‌లో రిలయన్స్‌ మొత్తం వాటా 19.63శాతం వాటాను చేరుకుంది. ఇన్ఫోసిస్‌:- ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది. సెంచరీ టెక్స్‌టైల్స్‌&ఇండస్ట్రీస్‌:- కంపెనీ డెరెక్టర్‌గా ఆర్‌కే దాల్మియా, సీఎఫ్‌ఓగా స్నేహాల్‌ షాష్‌ నియమితులయ్యారు. సద్భవన్‌ నైట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌:- షేరు విభజన అంశంపై

ఫ్లిప్‌కార్ట్‌ కోసం వాల్‌మార్ట్‌ రూ.7,439 కోట్ల పన్ను చెల్లింపు

Monday 17th September 2018

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్‌ మార్ట్‌ దేశీయ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు కోసం రూ.7,439 కోట్ల పన్నును చెల్లించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు 10 మంది నుంచి వాటాల కొనుగోలు కోసం ఈ మేరకు చెల్లించింది. ఇంకా 34 మంది నుంచి పన్నులను మినహాయించలేదు. ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్‌ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆ సంస్థకు, వాల్‌మార్ట్‌కు మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో

Most from this category