News


ఇన్ఫీపై యూఎస్‌లో దావా దాఖలు!

Thursday 12th December 2019
news_main1576134789.png-30191

దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌పై అమెరికాకు చెందిన షేర్‌హోల్డర్ల పరిరక్షణ న్యాయసలహా సంస్థ ద స్కాల్‌ లాఫరమ్‌ క్లాస్‌ యాక‌్షన్‌ సూట్‌ దాఖలు చేసింది. ఇన్ఫీ తన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి నష్టాలు వచ్చేలా చేసిందని దావాలో ఆరోపించింది. ఇన్ఫోసిస్‌ షేర్లను 2018 జూలై 7 నుంచి 2019 అక్టోబర్‌ 20 మధ్యలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమను ఈ నెల 23లోపు సంప్రదించి దావాలో భాగస్వామ్యులు కావచ్చని ప్రకటించింది. ఇన్ఫీ టాప్‌మేనేజ్‌మెంట్‌ అనైతిక వ్యవహారాలకు పాల్పడిందంటూ అక్టోబర్‌లో కొందరు విజిల్‌బ్లోయర్లు యూఎస్‌ సెక్‌కు లేఖ రాశారు. దీంతో షేరు ఒక్కమారుగా కుప్పకూలింది. ఇది యూఎస్‌ సెక్యూరిటీస్‌ ఎక్చేంజ్‌ యాక్ట్‌లోని 10బీ, 20ఏ నిబంధనలను, యూఎస్‌ సెక్‌ రూపొందించిన రూల్‌ 10బి-5ను ఉల్లంఘించడమేనని స్కాల్‌ సంస్థ ఆరోపించింది. విజిల్‌ బ్లోయర్లు ఆరోపించిన ప్రకారం చూస్తే కంపెనీ ప్రకటిస్తున్న ప్రకటనలన్నీ అబద్ధాలేనని దావాలో దుయ్యబట్టింది. సంస్థ గురించిని నిజాలు బయటకు రాగానే షేరు కుప్పకూలి ఇన్వెస్టర్ల సంపదను హరించిందని ఆరోపించింది. తాజా వార్త నేపథ్యంలో గురువారం ఇన్ఫోసిస్‌ షేరు దేశీయ ఎక్చేంజ్‌ల్లో దాదాపు 2 శాతం పైచిలుకు నష్టంతో ట్రేడవుతోంది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 12th December 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంకింగ్‌ రంగ షేర్ల జోరు కొనసాగుతుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,356.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు డిమాండ్‌ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.., మిడ్‌సెషన్‌ కల్లా కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం ర్యాలీ చేసి

లాభాల్లో మెటల్‌ షేర్లు

Thursday 12th December 2019

లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 2శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,525.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2శాతం లాభపడి 2559.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (2,509.55)తో

Most from this category