News


‘‘యూఎస్‌ సెక్‌’’ చేతిలో ఇన్ఫీ సాక్ష్యాలు!

Wednesday 23rd October 2019
news_main1571806907.png-29075

కంపెనీ విచారణ వల్ల ప్రయోజనం లేదంటున్న నిపుణులు
అమెరికా నియంత్రణ సంస్థ నిర్ణయమే కీలకం
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ విజిల్‌బ్లోయర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణకు అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ లాసంస్థను నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కానీ ఈ విషయమై పూర్తి సాక్ష్యాలు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ కమీషన్‌(యూఎస్‌ సెక్‌) చేతిలో ఉన్నందున కంపెనీ విచారణ ఎంతవరకు సాగుతుందోనని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విచారణ పూర్తికావాలంటే యూఎస్‌ సెక్‌పై ఆధారపడక తప్పదంటున్నారు. తమ ఆరోపణలకు సంబంధించిన మెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగ్‌లున్నాయని విజిల్‌బ్లోయర్లు పేర్కొన్నారు. వీటిని కంపెనీకి ఇచ్చేది లేదని వీళ్లు చెబుతున్న నేపథ్యంలో ఈ ఆధారాలు ఇన్ఫీకి కానీ, ఇన్ఫీ ఏర్పాటు చేసిన కమిటీకి కానీ దొరకకపోవచ్చని, అందువల్ల యూఎస్‌ సెక్‌ ఈ అంశంపై విచారణ పూర్తి చేసి ఫలితం ప్రకటించేవరకు వేచిచూడక తప్పకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇదే విషయాన్ని కంపెనీ సంబంధితవర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి.

ఆధారాలు కంపెనీకి ఇస్తే తమ వివరాలు బహిర్గతమవుతాయని, అందువల్ల నేరుగా సమర్పిస్తామని విజిల్‌బ్లోయర్లు యూఎస్‌ సెక్‌కు చెప్పారు. దీనికితోడు సెక్‌ నిర్వహించే విజిల్‌ బ్లోయర్‌ ‍ప్రొటెక‌్షన్‌ ప్రోగ్రామ్‌లో సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘనలను బయటపెట్టే వాళ్లకు నగదు బహుమతులుంటాయి. ఇలాంటి కంపెనీలపై విధించే మొత్తం పదిలక్షల డాలర్లు దాటితే ఫిర్యాదులు చేసినవాళ్లకు ఆమొత్తంలో 10- 30 శాతం బహుమతిగా ఇస్తారు.

మరోవైపు సెబి సైతం ఈ విషయంలో దర్యాప్తు చేయాలని భావిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కంపెనీని సెబి కోరవచ్చని తెలుస్తోంది. 
కంపెనీపై దావాకు న్యాయసంస్థల సన్నాహాలు
విజిల్‌బ్లోయర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు దేశీయ ఎక్చేంజ్‌ల్లో భారీ నష్టాలు చవిచూసింది. అటు యూఎస్‌ ఎక్చేంజ్‌లో సైతం ఇన్ఫీ షేరు భారీగా నష్టపోయింది. దీంతో యూఎస్‌ మదుపరుల ప్రయోజనాలు దెబ్బతీసిందంటూ కంపెనీపై క్లాస్‌ యాక‌్షన్‌ లాసూట్‌ వేసేందుకు అమెరికా న్యాయసంస్థలు సన్నద్ధమవుతున్నాయి. యూఎస్‌లో సెక్యూరిటీస్‌ క్లాస్‌ యాక‌్షన్‌ దావాలకు పేరొందిన రోజెన్‌ లాసంస్థ, ఇన్వెస్టర్ల నష్టాలు రికవరీ చేసేందుకు దావా వేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇన్ఫీ సంక్షోభానికి సంబంధించి అన్ని అంశాలను పరిశోధిస్తున్నామని ప్రకటించింది. ఈమేరకు ఇన్ఫీకి సంబంధించి నోటీసులు జారీ చేసింది. యూఎస్‌లో నెగిటివ్‌ వార్తల కారణంగా షేర్లు నష్టపోయిన సందర్భాల్లో ఇలాంటి క్లాస్‌యాక‌్షన్‌ దావాలు వేస్తుంటారు. You may be interested

కనిష్టస్థాయి నుంచి కోలుకున్న చమురు

Wednesday 23rd October 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో బుధవారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కోతను అమలు చేస్తారనే అంచనాలుండడంతో చమురు ధరల పతనం తగ్గింది. ఉదయం 10.23 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.47 శాతం నష్టపోయి బారెల్‌ 59.42 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.77 శాతం నష్టపోయి బారెల్‌ 54.06 డాలర్ల వద్ద

స్వల్ప నష్టంతో రూపీ ప్రారంభం

Wednesday 23rd October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 6 పైసలు బలహీనపడి 71 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలుండడంతో పాటు, చమురు ధరలు పడిపోతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో రెండు వారాల గరిష్టమయిన 70.94 వద్ద ముగిసింది. గత సెషన్లో అక్టోబర్‌ ఎన్‌ఎస్‌ఈ డాలర్‌-రూపీ కాంట్రాక్ట్‌ 71.0 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.43 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డెరక్ట్‌

Most from this category