News


స్టార్టప్‌లకు భారత్‌ స్వర్గధామం

Friday 18th October 2019
news_main1571373372.png-28966

  • మూడో అతిపెద్ద దేశంగా పేర్కొన్న హరూన్‌ 

ముంబై: విజయవంతమైన ఎక్కువ స్టార్టప్‌లను కలిగిన మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా భారత్‌ను ‘హరూన్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితా 2019’ గుర్తించింది. చైనా, అమెరికా తర్వాత స్థానాన్ని మనకు కేటాయించింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ (10 బిలియన్‌ డాలర్లు), ఓలా క్యాబ్స్‌ (6 బిలియన్‌ డాలర్లు), బైజూస్‌ (6 బిలియన్‌ డాలర్లు), ఓయోరూమ్స్‌ (5 బిలియన్‌ డాలర్లు) మన దేశం నుంచి విజయం సాధించిన స్టార్టప్‌లలో అగ్ర భాగాన ఉన్నాయి. భారత్‌ నుంచి ఇలా 21 యూనికార్న్‌ల(స్టార్టప్‌లు)ను హరూన్‌ జాబితా గుర్తించింది. చైనా 206 యూనికార్న్‌లు, అమెరికా 203 యూనికార్న్‌లతో టాప్‌-2గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ గుర్తించిన యూనికార్న్‌లలో 80 శాతం ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయి. యూరోప్‌లో 35 యూనికార్న్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లోని 118 పట్టణాల్లో ఏడేళ్ల క్రితం ఏర్పాటై, సగటున 3.4 బిలియన్‌ డాలర్ల విలువైన వాటిని హరూన్‌ పరిగణనలోకి తీసుకుంది. ‘‘ఈ యువ కంపెనీలు కేవలం ఏడేళ్ల క్రితం ఏర్పాటయ్యాయి. ఎంతో ఆసక్తి కలిగిస్తూ, కొత్త తరహా టెక్నాలజీలో ముందున్నాయి’’ అని హరూన్‌ రిపోర్ట్‌ చైర్మన్‌, రూపర్ట్‌ హూగ్‌వెర్ఫ్‌ పేర్కొన్నారు. 



You may be interested

జీ ఎంటర్‌టైన్మెంట్‌ లాభాలు రూ.412 కోట్లు

Friday 18th October 2019

7 శాతం వృద్ధి  8 శాతం వృద్ధితో రూ.2,190 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: మీడియా సంస్థ, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.412 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో వచ్చిన నికర లాభం, రూ.386 కోట్లతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,035 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,190

బ్రెక్సిట్ జోష్‌..బలపడిన రూపీ

Friday 18th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో స్వల్పంగా నష్టపోయి 71.19 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. బ్రిటన్‌, ఈయూ(యురొపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడంతో గత షెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అంతేకాకుండా గత కొన్ని సెషన్ల నుంచి విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు పెరగడంతో రూపీ డాలర్‌ మారకంలో బలపడుతూ వస్తోంది. బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడం, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌

Most from this category