News


ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించిన అమెరికా

Saturday 11th January 2020
news_main1578723304.png-30859

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలను అమెరికా విధించింది. ఇరాన్‌ ఎకానమీలో వివిధ విభాగాలను లక్ష్యంగా చేసుకొని తాజా ఆంక్షలను విధించింది. నిర్మాణం, ఉత్పత్తి, టెక్స్‌టైల్స్‌, మైనింగ్‌ రంగాలతో పాటు 8మంది టాప్‌ ఇరాన్‌ అధికారులు తాజా ఆంక్షల కిందకు వచ్చారు. ఇరాన్‌ ఎకానమీపై ఈ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌ నాయకత్వం పద్ధతి మార్చుకోనంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్‌ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే గతంతో పోలిస్తే అమెరికా ఆంక్షల టార్గెట్లు తగ్గుతున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2015 ఒప్పందం నుంచి రెండేళ్ల క్రితం వైదొలిగిన మీదట ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా పలురకాలుగా యత్నిస్తోంది. ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించి అదుపులో ఉంచాలనేది అమెరికా ఆలోచన. ఇప్పటికే ఇరాన్‌ చమురు ఉత్పత్తిపై అమెరికా పలు ఆంక్షలు విధించింది. దీంతో కొత్తగా చమురుపై సాంక‌్షన్స్‌ విధించేందుకు ఛాన్సులు సన్నగిల్లాయి. ఇరాన్‌కు చెందిన బడా షిప్పింగ్‌ కంపెనీ, మేజర్‌ ఎయిర్‌లైన్స్‌లు ఇప్పటికే ఆంక్షల పరిధిలో ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో ఇరాన్‌కు చెందిన 26 మంది ప్రముఖులను, సంస్థలను యూఎస్‌ ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. ఇప్పటికే ఇన్ని ఆంక్షల నడుమ ఉన్న ఇరాన్‌కు కొత్త ఆంక్షలు పెద్దగా బాధించవని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నవారికి మరో దెబ్బ పెద్దగా బాధ కలిగించదని అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తాజా ఆంక్షలు స్థూల ఆర్థికాంశాలపై పెద్ద ప్రభావం చూపుతాయని, నెమ్మదిగా ఈ ప్రభావం కనిపిస్తుందని మరికొందరి అంచనా. తాజా ఆంక్షలతో పాటు విడిగా ఇరాన్‌కు చెందిన బడా స్టీల్‌ ఉత్పత్తి సంస్థలపై అమెరికా 17 ప్రత్యేక సాంక్షన్స్‌ విధించింది. ఇవన్నీ ఇరాన్‌కు కోట్ల డాలర్ల సాయం అందకుండా చేస్తాయని యూఎస్‌ ప్రకటించింది. తాజా ఆంక్షలు ప్రపంచ మెటల్‌ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచిచూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి రూ. 45,000 కోట్లు..!?

Saturday 11th January 2020

కేంద్రం మరోసారి ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డివిండెడ్‌ను పొందేందుకు పావులు కదుపుతోంది. పడకేసిన ఆర్థికవ్యవస్థను వృద్ధి బాటలో పయనింపజేసేందుకు కేంద్రం మధ్యంతర డివిడెండ్‌ రూపంలో ఆర్‌బీఐ నుంచి రూ.35,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిసోస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆర్థిక వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి పతనవుతుందనే అంచనాలతో కేంద్రం ఆర్‌బీఐ తలుపు తట్టడమే మేలని భావిస్తోంది. ఆర్‌బీఐ సమకూర్చే ఈ మధ్యంతర డివిడెండ్‌ ద్వారా ఆర్థిక వ్యవస్థను

ఇక మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ హవా

Saturday 11th January 2020

2020లో ఈక్విటీ మార్కెట్లు గుడ్‌ విదేశీ ఆందోళనల ప్రభావం స్వల్పకాలికమే వినోద్‌ నాయర్‌ అంచనాలు ఈ కేలండర్‌ ఏడాది(2020)లో ఈక్విటీ మార్కెట్‌ వెలుగులో నిలవనున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రీసెర్చ్‌ హెడ్‌.. వినోద్‌ నాయర్‌ అంచనా వేస్తున్నారు. ప్రధాన లార్జ్‌ క్యాప్స్‌ ఇప్పటికే భారీగా ర్యాలీ చేయడంతో ఇండెక్సులు దూకుడు చూపినప్పటికీ, ఇక మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌ క్యాప్‌) కౌంటర్లకు డిమాండ్‌ కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇంకా పలు అంశాలపై నాయర్‌ అంచనాలు ఎలా ఉన్నాయంటే...  రిస్కులు తగ్గాయ్‌.. కొత్త

Most from this category